/rtv/media/media_files/2026/01/05/britain-mp-2026-01-05-11-01-56.jpg)
Entire Jammu and kashmir Should Be Reunited With India, Says British MP Bob Blackman
బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. POKతో పాటు జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ భారత ప్రభుత్వానికి సూచనలు చేశారు. పాకిస్థాన్.. కశ్మీర్‌ను ఆక్రమించడాన్ని తాను గతంలో కూడా వ్యతిరేకించానని అన్నారు. ఎప్పటికీ దీన్ని వ్యతిరేకిస్తూనే ఉంటానని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దును 1992లో కశ్మీరి పండితుల కన్నా ముందుగానే చేపట్టాల్సి ఉండేదని అన్నారు.
Also Read: విమానాల్లో ప్రయాణించేవారు వాటిని వాడొద్దు.. DGCA కీలక ప్రకటన
Jammu And Kashmir Should Be Reunited With India
రాజస్థాన్(rajasthan) లోని జైపూర్‌లో జరిగిన హై టీ కార్యక్రమంలో బ్రిటన్ ఎంపీ బాబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ను పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించడమే కాక POKలోని ఉగ్రవాదాన్ని విస్తరింపజేయడం సరైన చర్య కాదని అసహనం వ్యక్తం చేశారు. అందుకే పీఓకేతో సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో విలీనం చేసుకోవాలని తాను చాలాసార్లు సూచించానని స్పష్టం చేశారు.
Also read: భారత్‌పై మళ్లీ టారిఫ్‌లు పెంచుతా.. ట్రంప్ సంచలన హెచ్చరిక
గతేడాది ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిని బాబ్ కూడా తీవ్రంగా ఖండించారు. గత కొన్నేళ్లుగా కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడుతుండటంతో అక్కడ శాంతి ఉంటుందని భావించానన్నారు. కానీ పహల్గాం ఉగ్రదాడితో మళ్లీ ఉగ్రసమస్య వెలుగుచూసిందని అన్నారు. భారత సరిహద్దుల్లో ఉగ్రవాదం పెరిగితే ఇరుదేశాల మధ్య కాల్పుల విమరణ ఒప్పందం ఉల్లంఘనకు గురయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరించారు.
Follow Us