PAK: పీవోకేలో మదరసాలు బంద్.. పిల్లలకు అత్యవసర సేవ పాఠాలు
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ప్రధాన నగరమైన ముజఫరాబాద్ లో చదువులు చెప్పే 1000 మదరసాలు బంద్ అయ్యాయి. అక్కడ పిల్లలకు చదువు బదులుగా అత్యవసర సేవల్లో శిక్షణ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ప్రధాన నగరమైన ముజఫరాబాద్ లో చదువులు చెప్పే 1000 మదరసాలు బంద్ అయ్యాయి. అక్కడ పిల్లలకు చదువు బదులుగా అత్యవసర సేవల్లో శిక్షణ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
జమ్మూ కాశ్మీర్లోని LOC వెంబడి భారత పోస్టులపై శనివారం వరుసగా 9వ రాత్రి పాకిస్తాన్ సైన్యం కాల్పుల జరిపింది. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో కాల్పులు జరిగినట్లు సమాచారం. పాకిస్తాన్ కాల్పులకు భారత బలగాలు ధీటైన సమాధానం ఇచ్చాయి.
పాకిస్తాన్ అలెర్ట్ అయింది. నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఉన్న 13 నియోజకవర్గాల్లో రెండు నెలల పాటు ఆహార సామాగ్రిని నిల్వ చేసుకోవాలని సూచనలు జారీ చేసినట్లు పాకిస్తాన్ పాలిత కశ్మీర్ ప్రధాన మంత్రి చౌదరి అన్వర్ ఉల్ హక్ శుక్రవారం అసెంబ్లీలో తెలిపారు.