India-China: షక్స్ గామ్ వ్యాలీ మాదంటే మాదంటున్న భారత్, చైనాలు..ప్రకటనలు

షక్స్ గామ్ వ్యాలీ విషయంలో భారత్, చైనాలు వాదులాడుకుంటున్నాయి.  అక్కడ చేపడుతున్న పనుల గురించి భారత్ విమర్శిస్తే..ఆ ప్రాంతం మాదంటూ చైనా ప్రకటనలు చేస్తోంది. 

author-image
By Sameera
New Update
shaksgam

షక్స్ గామ్ వ్యాలీ...ఇది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఒక భాగం. మొత్తం 5, 180 చదరపు కిలోమీటర్ల భూభాగం. దీన్ని 1963లో పాక్ చట్ట విరుద్ధంగా చైనాకు అప్పగించింది. అయితే భారత్ అప్పటి నుంచి దీన్ని ఒప్పుకోవడం లేదు. షక్స్ గామ్ లోయ భారత భూభాగమని చెబుతూనే ఉంది. తాజాగా ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. 

తెరపైకి షక్స్ గ్యామ్ వ్యాలీ వివాదం..

షక్స్ గామ్ వ్యాలీలో చైనా తాజాగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టింది. అయితే దీనిపై భారత్ అభ్యంతరం తెలిపింది. 1963లో చైనా-పాక్ సరిహద్దు ఒప్పందాన్ని గుర్తించమని...అక్కడ నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధమని అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీన్ జైస్వాల్ అన్నారు.  చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌(CPEC)ను కూడా తాము గుర్తించమని, ఇది పాకిస్తాన్ బలవంతంగా, చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భారత భూభాగం గుండా వెళ్తోందని ఆయన అన్నారు.ఇది భారత భూభాగం కాబట్టి దాని ప్రయోజనాలనున కాపాడుకునే అవసరమైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని చెప్పారు. 

ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు చైనా కూడా ప్రకటన చేసింది. ఈ ప్రాంతంలో చేపడుతున్న సౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిందకు అతీతమని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. షక్స్ గామ్ చైనాలో భూభాగమని మరో సారి వాదించారు. చైనా తన సొంత భూభాగంలో మౌలిక సదుపాయాలను నిర్మించడాన్ని నిందించకూడదని ఆమె అన్నారు. చైనా, పాకిస్తాన్ 1960ల నుండి సరిహద్దు ఒప్పందంపై సంతకం చేశాయని, రెండు దేశాల మధ్య సరిహద్దును నిర్ణయించాయని మావో చెప్పారు. సార్వభౌమ దేశాలుగా మా రెండు దేశాలకు ఈ హక్కు ఉందని చెప్పారు. CPEC ద్వారా స్థానిక ఆర్థిక, సామాజిక అభివృద్ధి, ప్రజల జీవనోపాధి మెరుగుపరిచేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. CPEC కాశ్మీర్ సమస్యపై చైనా వైఖరిని ప్రభావివతం చేయమని, ఈ విషయంలో చైనా వైఖరి మాదని చెప్పారు.  భారత్, పాకిస్తాన్ కాశ్మీర్ సమస్యలను ఇందులోకి తీసుకు రాకూడదని మావో అన్నారు. వాటిని యూఎన్ ద్వారా ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం, శాంతి యుతంగా పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు. షక్స్ గ్యామ్ వ్యాలీ విషయంలో కాశ్మీర్ అంశాన్ని తీసుకురావద్దని చెప్పారు. 

Also Read: Durandhar VS Rajasab: దురంధర్ ను బీట్ చేయలేకపోయిన రాజాసాబ్..హిందీలో అట్టర్ ఫ్లాప్

Advertisment
తాజా కథనాలు