Mohan Bhagwat: ఆ ప్రాంతాన్ని వెనక్కు తీసుకోవలసిందే...పీవోకే పై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ ఆదివారం మరోసారి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. PoK లో ప్రజలు తిరగబడటం, ఉద్రిక్తతల నేపథ్యంలో మోహన్ భగవత్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

New Update
Mohan Bhagwat

Mohan Bhagwat

Mohan Bhagwat : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ ఆదివారం మరోసారి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు.పాకిస్థాన్ పాలకుల అణిచివేతపై పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (PoK)లో ప్రజలు తిరగబడటం, ఉద్రిక్తతల నేపథ్యంలో మోహన్ భగవత్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని సత్నాలో సింధీ క్యాంప్ గురుద్వారా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... భారతదేశాన్ని ఒక ఇల్లుతో పోల్చారు భగవత్. భారతదేశం అనే ఇంటిలోని ఒక గది 'పాక్ ఆక్రమిత కశ్మీర్' అని అన్నారు. ఇంట్లోని గదిని ఎవరో ఆక్రమిస్తే చూస్తూ ఊరుకుదామా? దానిని మనం వెనక్కి తీసుకోవాలని, మనది అవిభక్త భారతదేశమని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. భారతదేశం పీఓకేను తిరిగి పొందాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

Also Read :  ప్రేమ పేరుతో కానిస్టేబుల్‌ మోసం..అనుమానస్పదంగా యువతి మృతి

ఇంకా ఆయన మాట్లాడుతూ మనల్ని మనం భిన్నంగా పిలుచుకుంటున్నప్పటికీ నిజం ఏమిటంటే మనమంతా ఒకటేనని, మనమంతా హిందువులమేనని అన్నారు. 'చాలా మంది సింధీ సోదరులు ఇక్కడున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్లు పాకిస్థాన్ వెళ్లలేదు. వాళ్లు అవిభక్త భారతదేశానికి వెళ్లారు. పరిస్థితులు మనని ఇక్కడి నుంచి ఆ ఇంటికి పంపాయి. ఎందుకంటే ఆ ఇల్లూ, ఈ ఇల్లూ వేరుకావు. ఇండియా మొత్తం ఒకే ఇల్లు. నా ఇంట్లో టేబులు, కుర్చీ, బట్టలు ఉంచుకునే గదిని ఒకరు తొలగించారు. దాన్ని ఆక్రమించుకున్నారు. రేపు, వాటిని నేను వెనక్కి తీసుకోవాలి' అని మోహన్ భగవత్ అన్నప్పుడు సభలో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.

Also Read :  గాయకుడు జుబీన్‌ గార్గ్ మృతిలో బిగ్‌ ట్విస్ట్‌.. ఆయనపై విష ప్రయోగం? సంచలన ఆరోపణలు..     

కాగా పీఓకేలో హింసాత్మక నిరసనలు చెలరేగుతున్నాయి. అక్కడ ఇప్పటికే 12 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ సందర్భంగా భగవత్ మాట్లాడారు. పాకిస్తాన్ ప్రభుత్వం,  సైన్యం పీఓకేలో చేస్తున్న దురాగతాలకు వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JKJAAC) ఆందోళన చేస్తుందన్నారు. నిరసనలను ఆపడానికి పాకిస్తాన్ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JKJAAC)తో 25 అంశాలతో ఒప్పందం చేసుకుందన్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిక్ ఫజల్ చౌదరి సోషల్ మీడియాలో తెలిపారు. ఈ ఒప్పందంలో....  హింసలో మరణించిన వారికి పరిహారం ఇవ్వనున్నారు, ముజఫరాబాద్, పూంచ్ డివిజన్లకు రెండు అదనపు ఇంటర్మీడియట్,సెకండరీ విద్యా బోర్డులను ఏర్పాటు చేమనున్నట్లు స్పష్టం చేసినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: విజయవాడలో సైకో.. దసరా ముందు మటన్ కత్తితో పిన్నిని ముక్కలు ముక్కలుగా

Advertisment
తాజా కథనాలు