PM Modi : రైతులకు గుడ్‌న్యూస్.. ఈరోజే రూ.2 వేలు జమ
పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా ప్రధాని మోదీ.. రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లు విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 9.4 కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకం ద్వారా రూ.2 వేలు పొందనున్నారు.
పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా ప్రధాని మోదీ.. రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లు విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 9.4 కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకం ద్వారా రూ.2 వేలు పొందనున్నారు.
పాకిస్థాన్‌లోని అక్టోబర్ 15, 16వ తేదీల్లో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ వెళ్లనున్నారు. 2015 డిసెంబర్ తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.
దేశ యువతకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ‘పీఎం ఇంటర్న్‌షిప్’ పథకాన్ని పైలట్ ప్రాతిపదికన ప్రారంభించింది. డిగ్రీ, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు 2024 అక్టోబరు 12 నుంచి 25 దాకా ‘పీఎం ఇంటర్న్‌షిప్’ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైన తర్వాత కాంగ్రెస్‌లో చేరిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అనర్హత వేటుకు గురైన సమయంలో ప్రధాని మోదీ నుంచి ఫోన్ వస్తే మాట్లాడేందుకు నిరాకరించానని పేర్కొన్నారు.
మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ తెలంగాణను ప్రశంసించారు. నాలుగేళ్ల నుంచి మొక్కలు నాటుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కె.ఎన్ రాజశేఖర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. 'ఎక్ పెడ్ మా కే నామ్' కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగం కావాలన్నారు.
సర్జికల్ స్ట్రైక్‌తో శత్రుదేశానికి భయం పుట్టించామని.. మళ్ళీ ఏదైనా చేయాలంటే భయపడేలా చేశామని అన్నారు ప్రధాని మోదీ. జమ్మూ–కశ్మీర్లో మూడవ విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఆయన ఈరోజు ప్రచారం నిర్వహించారు.
శాస్త్రీయ పరిశోధనలకై రూ.130 కోట్ల వ్యయంతో ఢిల్లీ, పూణె, కోల్‌కతాలో ఏర్పాటు చేసిన 'పరమ్ రుద్ర' సూపర్ కంప్యూటర్లను ఢిల్లీలో వర్చువల్‌గా ప్రారంభించారు. వాతావరణ పరిశోధనల కోసం తయారుచేసిన హై-ఫెర్ఫామెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్‌ను కూడా ఆవిష్కరించారు.
వాతావరణ పరిస్థితులను మరింత కచ్చితత్వంతో పసిగట్టే సాంకేతికత రానుంది. ప్రస్తుతం వాడుతున్న సూపర్ కంప్యూటర్ల సామర్థ్యాన్ని 6.8 పెటాఫ్లాప్స్ నుంచి 22 పెటాఫ్లాప్స్‌కు పెంచారు. అరుణిక, అర్కా అనే సూపర్ కంప్యూటర్లను ప్రధాని మోదీ త్వరలోనే ప్రారంభించనున్నారు.
న్యూయార్క్ వేదికగా నిర్వహించిన 'మోదీ అండ్ యూఎస్' కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ నరేంద్ర మోదీ మాట్లాడారు. ప్రవాస భారతీయులను ఇరు దేశాల అనుసంధానకర్తలుగా అభివర్ణించారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వ విజయాలను వివరించారు.