PM Modi: అత్యంత ముఖ్యమైన జపాన్, చైనాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ

భారత ప్రధాని మోదీ ముఖ్యమైన పర్యటన మొదలైంది. కొద్ది సేపటి క్రితం ఆయన ఢిల్లీ నుంచి జపాన్ కు బయలు దేరారు. అక్కడి నుంచి ఎస్సీఓ శిఖరాగ్ర సంస్థ సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్ళనున్నారు. 

New Update
modi visit

PM Modi Started to Japan

ప్రధాని మోదీ రెండు దేశాల పర్యటన మొదలైంది. దీని కోసం ఈరోజు రాత్రి ఆయన ఢిల్లీ నుంచి జపాన్ కు పయనమయ్యారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు ఈ నెల 29 నుంచి 30 వరకు అక్కడ పర్యటించనున్నారు.  అక్కడ భారత్, జపాన్ వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. ప్రధాని మోదీ చివరి సారి 2003లో జపాన్ వెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే పర్యటిస్తున్నారు. గత 11 ఏళ్ళుగా ఇరు దేశాలు దౌత్య పరంగా స్థిరమైన పురోగతి సాధించాయి. ప్రస్తుతం ప్రపంచంలో వాణిజ్య యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో రెండు దేశాల అధినేతలూ తమ మధ్య భాగస్వామ్యం మరింత పెంపొందించే విధంగా చర్చలు చేయనున్నారు.  

జపాన్ తర్వాత చైనా..

జపాన్ తర్వాత ప్రధాని మోదీ అత్యంత ముఖ్యమైన చైనాకు వెళ్ళనున్నారు.  అక్కడ షాంఘై లో జరిగే ఎస్సీవో శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఇందులో చైనా, ఇండియాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటూ..ఒకరికొకరు సహకారాన్ని విస్తృతం చేసే విధంగా చర్చించనున్నారు. రెండు దేశాలు కట్టుబడి పని చేసేందుకు  ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జెన్ పింగ్ తో పాటూ రష్యా అధినేత పుతిన్ తో కూడా భేటీ అవ్వనున్నారు. 2020లో లద్దాఖ్‌ సరిహద్దుల్లో భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణల అనంతరం ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. భారత్, చైనాలపై అమెరికా సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ ప్రధాని మోదీ పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: BIG BREAKING: అమెరికాకు కౌంటర్.. రష్యా నుంచి ముడి చమురు దిగుమతిని పెంచనున్న భారత్ !

Advertisment
తాజా కథనాలు