/rtv/media/media_files/2025/09/01/india-china-2025-09-01-11-03-34.jpg)
India-China
భారత ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) ప్రస్తుతం చైనా పర్యటన(China Tour) లో ఉన్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అయితే డ్రాగన్, ఏనుగుల మధ్య ఈ స్నేహం వల్ల కేవలం చైనాకే కాదు.. భారత్‌కు ఉన్న లాభముంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో పాటు భారత్‌కు కూడా అనేక లాభాలు కూడా చేకూరుతాయని తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: PM Shehbaz Sharif : పరువు పోయిందిగా.. పాక్ ప్రధానిని పట్టించుకోని మోదీ
చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి. తయారీ రంగంలో ఈ దేశం అగ్రస్థానంలో ఉంది. భారత్‌తో స్నేహం బలపడితే, చైనా కంపెనీలు భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. దీనివల్ల మన దేశంలో కొత్త పరిశ్రమలు వస్తాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే భారతీయ ఉత్పత్తులకు చైనా ఒక పెద్ద మార్కెట్‌గా మారుతుంది. ఇది మన దేశీయ పరిశ్రమలకు, వ్యవసాయ రంగానికి లాభం చేకూరుస్తుంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు ఎక్కువగా ఉన్నప్పటికీ స్నేహపూర్వక సంబంధాలతో అది తగ్గుతుందని తెలుస్తోంది. చైనా 5G, కృత్రిమ మేధ, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన రంగాలలో అపారమైన సాంకేతికత ఉంది.
India and China are taking steps to rebuild ties after years of tension. The two countries have agreed to restart direct flights, ease visas, and strengthen people-to-people and trade relations. PM Modi and Xi Jinping emphasised friendship, cooperation, and shared responsibility… pic.twitter.com/D6Nr6tbcVA
— Markets Today (@marketsday) August 31, 2025
ఈ సాంకేతికతను భారత్ చైనా నుంచి పొందగలిగితే మన దేశంలో కూడా పరిశ్రమలు ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతాయి. అయితే చైనా సాంకేతికతతో మన దేశంలో అత్యాధునిక మౌలిక వసతులను నిర్మించుకోవచ్చు. చైనా ప్రతిపాదించిన "బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్" వంటి ప్రాజెక్టులపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తే కొత్త వ్యాపారాలు సృష్టించవచ్చు. భారత్, -చైనా సరిహద్దులో వివాదాలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాలు తమ బడ్జెట్‌లో భారీ మొత్తాన్ని సైనిక ఖర్చులకు కేటాయిస్తున్నాయి. దీంతో శాంతి బలపడుతుంది. రెండు దేశాలు కూడా తమ ఆర్థిక వనరులను ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఉపయోగించవచ్చు.
వాణిజ్య పరంగా మార్పులు..
భారత్, చైనా రెండు కూడా ఐక్యరాజ్యసమితి, బ్రిక్స్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలలో కీలక సభ్యులు. ఇరు దేశాలు కలిసి పనిచేస్తే అంతర్జాతీయ వేదికలపై అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలను బలంగా వినిపించవచ్చు. దీనివల్ల పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. ఉగ్రవాదం మార్పులు, ప్రపంచ వాణిజ్య నిబంధనలు వంటి సమస్యలపై ఇరు దేశాలు కలిసి పనిచేయడం వల్ల ప్రపంచానికి కూడా లాభం చేకూరుతుంది. ఈ రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉంటే పొరుగు దేశాలపై ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల భవిష్యత్తులో యుద్ధాలు, ఘర్షణలు రాకుండా నిరోధించగలదు.
ఇది కూడా చూడండి: India-China : పాకిస్తాన్‌ను చావు దెబ్బ కొట్టిన చైనా.. ఇండియాకు ఫుల్ సపోర్ట్!