/rtv/media/media_files/2025/01/28/s1UuSuJHkj8pJZaFDAsZ.jpg)
Pm Narendra Modi, President Trump
భారత్, అమెరికా దౌత్య సంబంధాలపై అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. దీనికి సంబంధించి తన ట్రూత్ సోషల్ మీడియా(Social Media) లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇండియా, అమెరికాల మధ్య వాణిజ్య సమస్యల ఉద్రిక్తత నడుస్తోంది. వీటిపై తన పరిపాలనా విభాగం ఆల్రెడీ ఇండియాతో చర్చలు చేస్తోందని ట్రంప్ తెలిపారు. అది కాక వచ్చే రెండు , మూడు వారాల్లో తానే స్వయంగా భారత ప్రధాని మోదీ(PM Modi) తో మాట్లాడతానని చెప్పారు. మోదీ తనకు మంచి స్నేహితుడని..ఆయనతో మాట్లాడ్డానికి ఎదురు చూస్తున్నాను అంటూ రాసుకొచ్చారు. రెండు దేశాలకు విజయవంతమైన ముగింపుకు వస్తాయని అన్నారు. ఇండియా, అమెరికాల మధ్య ఎటువంటి ఇబ్బంది ఉండదని..భవిష్యత్తులో కూడా రాకుండా చూసుకుంటామని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Also Read : నేపాల్‌లో పడిపోయిన ప్రభుత్వం.. రంగంలోకి ఆర్మీ
రష్యాపై ఒత్తిడి తీసుకురావాలి..
మరోవైపు రష్యా ఉక్రెయిన్ పై యుద్ధాన్ని(Russia-Ukraine War) ఆపేందుకు తనతో చేరాలని ట్రంప్ యూరోపియన్ నాయకులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. మంగళవారం దీనికి సంబంధించి ఆయన యూరోపియన్ యూనియన్ అధికారులతో సమావేశం అయ్యారు. చైనాపై యూరప్ విధించే ఏ సుంకాలనైనా అమెరికా ఆమోదిస్తుందని అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఒత్తిడి పెంచాలని ట్రంప్ భావిస్తున్నారు. యూరోపియన్ నాయకులతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో కూడా భారత్ పై వాణిజ్య సుంకాల గురించి, చర్చల గురించి చెప్పారు. భారతదేశం, అమెరికా మధ్య ప్రత్యేక సంబంధం ఉంది. ఆందోళన చెందడానికి ఏమీ లేదు. అప్పుడప్పుడు కొంత గ్యాప్ వస్తుంటుంది. అవి తాత్కాలికం మాత్రమే. ఈ నిర్దిష్ట సమయంలో ఆయన చేస్తున్నది నచ్చకపోయినా తాను ఎల్లప్పుడూ మోడీతో స్నేహంగా ఉంటానని మోదీ చెప్పుకొచ్చారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) విధించిన 25 శాతం అదనపు సుంకాలు అమల్లోకి వచ్చాయి. దీనిపై భారత్ ఎన్ని సార్లు చర్చలు జరిపినా అమెరికా వెనక్కు తగ్గలేదు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ తో యుద్ధానికి ప్రోత్సహిస్తోందన్న కారణంగా ట్రంప్ భారత్ పై 50 శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు. దీంతో అమెరికా, భారత్ ల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. అయితే ట్రంప్ సుంకాల వెనుక అసలు కారణం రష్యా చమురు కాదని..ఆ దేశ పాడి ఉత్పత్తులను భారత్ దిగుమతికి అనుమతించకపోవడమే అని భారత్ అంటోంది. తమ దేశ రైతులకు, పాడి వ్యవసాయదారులకు నష్టం కలిగే పనులు ఎప్పటికీ చేయమని..దానికి కోసం ఎంత నష్టమైనా భరిస్తామని చెప్పింది.
Also Read : నేపాల్ ఘర్షణలపై స్పందించిన ప్రధాని మోదీ