Maruti Suzuki e-VITARA: ప్రధాని మోదీ ల్యాంచ్ చేసిన ఈ-కారు.. ప్రత్యేకతలేంటో తెలుసా?

మారుతి సుజుకి నుంచి ఇండియాలో ఫస్ట్ టైం పూర్తి ఎలక్ట్రిక్ SUV e-VITARA ప్రధాని మోదీ ల్యాంచ్ చేశారు. గుజరాత్‌లోని హన్సల్‌పూర్ నుండి హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఇది సెప్టెంబర్ 3, 2025న మార్కెట్లోకి విడుదల కానుంది.

New Update
Maruti Suzuki e-VITARA

Maruti Suzuki e-VITARA

మారుతి సుజుకి నుంచి ఇండియాలో ఫస్ట్ టైం పూర్తి ఎలక్ట్రిక్ SUV e-VITARA(Maruti Suzuki e-VITARA) ప్రధాని మోదీ(PM Modi) ల్యాంచ్ చేశారు. గుజరాత్‌లోని హన్సల్‌పూర్ నుండి హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఇది సెప్టెంబర్ 3, 2025న మార్కెట్లోకి విడుదల కానుంది. భారత్ నుంచి 100కు పైగా దేశాలకు ఎగుమతి చేసేందుకు రూపొందించబడింది. ఈ కారు 'ఈవీఎక్స్' (eVX) కాన్సెప్ట్ ఆధారంగా తయారు చేయబడింది. మారుతి e-VITARA భారతదేశంలోనే కాకుండా, ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలకు ఎగుమతి చేసేందుకు రూపొందించబడింది. ఇది ఆధునిక టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లు, మరియు అద్భుతమైన రేంజ్‌తో మార్కెట్‌లో ఓ స్పెషలిటీతో ఉంది.

Also Read :  ఐఫోన్ వాడేవారికి బిగ్ అలెర్ట్.. కేంద్రం వార్నింగ్!

బ్యాటరీ $ రేంజ్:

ఈ కారు రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లతో రానుంది. 49 kWh బ్యాటరీ ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారుగా 346 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 61 kWh  బ్యాటరీతో సింగిల్ మోటార్ వెర్షన్ 420 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయవచ్చు. 142 bhp మరియు 172 bhp  రెండు మోడల్స్‌లో ఉంది. 

డిజైన్:
ఈ కారుకు ప్రీమియం లుక్ ఇవ్వడానికి, ఎల్ఈడీ హెడ్‌లైట్లు, డిఆర్‌ఎల్, మరియు టెయిల్‌ల్యాంప్‌లు ఉంటాయి. ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని పెంచడానికి యాక్టివ్ ఎయిర్ వెంట్ గ్రిల్‌తో పాటు, 18 అంగుళాల వీల్స్ కూడా ఉన్నాయి.

ఇంటీరియర్: 
ఈ కారు క్యాబిన్‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. వీటిలో పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ-కలర్ యాంబియెంట్ లైటింగ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేలకు మద్దతు ఇస్తుంది.

సేఫ్టీ ఫీచర్లు:
భద్రత విషయంలో మారుతి e-VITARA అత్యున్నత ప్రమాణాలను పాటిస్తుందని అంచనా. ఇందులో లెవెల్-2 ADAS (Advanced Driver Assistance System), 7 ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్, పార్కింగ్ సెన్సార్లు వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

ధర:
మారుతి e-VITARA ఎక్స్-షోరూమ్ ధర సుమారుగా రూ.17 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. అయితే, అధికారిక ఈ కారు ధర ఇంకా కంపెనీ ప్రకటించాల్సి ఉంది. ఈ కారు భారతీయ మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. మారుతి సుజుకి ఈ మొదటి ఎలక్ట్రిక్ కారు భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒక ముఖ్యమైన మార్పును తీసుకొస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Also Read :  2 నిమిషాలు.. 15 బిలియన్‌ వ్యూస్.. యూట్యూబ్‌ను షేక్ చేసిన టాప్ వీడియోలు ఇవే..!

Advertisment
తాజా కథనాలు