PM Modi on Trump Tariffs: రైతులు, దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఎంత ఒత్తిడిపైనా భరిస్తాం..ప్రధాని మోదీ

అదనపు సుంకాల గడువు దగ్గర పడుతున్న వేళ భారత ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు, దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుంటామని చెప్పారు. ఎవ్వరికీ తలవొంచేది లేదని ట్రంప్ కు స్ట్రాంగ్ మేసేజ్ ఇచ్చారు.

New Update
PM modi

PM Modi On Trump Tariffs

ఆగస్టు 27కు ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఆ రోజు అర్ధరాత్రి నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్...భారత్ పై విధించిన అదనపు సుంకాలు అమల్లోకి రానున్నాయి. దీని వలన మన దేశంపై అదనపు భారం పడనుంది. అయితే ఎలాంటి ఒత్తిడిపైనా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు ప్రధాని మోదీ. అదనపు సుంకాల వలన కచ్చితంగా ప్రభుత్వం మీద, భారత వ్యాపారం మీదా ప్రెజర్ పడుతుంది.  అయినా సరే ఎవ్వరికీ తలవొంచేది లేదని మోదీ అన్నారు. రైతులు, దేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి స్పష్టం చేశారు. 

ఒత్తిడి ఉంది అయినా పర్వాలేదు..

అహ్మదాబాద్ లో జరిగిన రోడ్ షో ప్రధాని మోదీ పాల్గొన్నారు.ఇందులో అదనపు సుంకాల గురించి మోదీ మాట్లాడారు. చిన్న వ్యవస్థాపకులు, రైతులు, పశువుల పెంపకం దారులకు తాను మళ్ళీ మళ్ళీ ఒకటే చెప్పాలనుకుంటున్నానని..మీ ప్రయోజనాలపై మా ప్రభుత్వం ఎప్పుడూ రాజీ పడదని అన్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా, మేము దానిని భరిస్తాము. కానీ మీ ప్రయోజనాలకు ఎప్పటికీ హాని జరగనివ్వమని హామీ ఇచ్చారు.

అలాగే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడాన్ని కూడా ప్రధాని మోదీ సమర్థించారు. ప్రపంచంలో అతి పెద్ద ముడి చమురు దిగుమతిదారులలో భారత్ ఒకటి. ష్యన్ చమురును కొనుగోలు చేయడం వల్ల భారతదేశానికి దిగుమతి ఖర్చులపై బిలియన్ల డాలర్లు ఆదా అయ్యాయి. దాని కారణంగా దేశీయ ఇంధన ధరలు సాపేక్షంగా స్థిరంగా ఉన్నాయని చెప్పారు. అమెరికా చమురును సాకుగా చూపించి సుంకాలు విధించడం చాలా అన్యాయమని మోదీ అన్నారు. నేడు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆర్థిక ప్రయోజనాల ఆధారంగా రాజకీయాలు చేయడంలో బిజీగా ఉన్నారు. అమెరికా కూడా అదే చేస్తోంది. కానీ మన దేశం మాత్రం మీద పడి ఏడుస్తోందని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

స్వదేశీ వస్తువులను ప్రమోట్ చేయండి..

ట్రంప్ టారీఫ్ ల వేళ ప్రధాని మోదీ మరోసారి స్వదేశీ వస్తువుల వినియోగం మీద ఒత్తిడి తీసుకువచ్చారు. ప్రతీ దుకాణం వద్దా స్వదేశీ వస్తువుల బోర్డులు ఉండాలని పిలుపునిచ్చారు. ఇది పండుగల సీజన్. ఇప్పుడు నవరాత్రి, విజయదశమి, ధంతేరస్, దీపావళి...పండుగలు వరుసగా వస్తాయి. వీటికి మన దేశంలో తయారయ్యే వస్తువులను మాత్రమే అమ్మాలని చెప్పారు. స్వదేశీ వస్తువుల ప్రతిజ్ఞకు దేశ పౌరులతో పాటూ వ్యాపారులు కూడా కట్టుబడి ఉండాలని మోదీ చెప్పారు. మన దేశ పురోగతి దీని వలనే వస్తుందని అన్నారు. 

Also Read: Trump Tariffs: అదనపు సుంకాలు పక్కా..మరోసారి ట్రంప్ ప్రకటన

Advertisment
తాజా కథనాలు