/rtv/media/media_files/2025/08/25/pm-narendra-modi-urges-indians-to-not-buy-foreign-goods-2025-08-25-06-35-31.jpg)
PM Narendra Modi Urges Indians to not Buy Foreign Goods
ఈ నెల 9 వ తేదీ నుంచి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ ప్రారంభమవనుంది. ఆ తరువాత 23 నుంచి 29 వరకు సర్వసభ్య దేశాల ప్రతినిధుల అత్యున్నత స్థాయి సమావేశాలు జరుగుతాయి. ఇందులో మొదట బ్రెజిల్ ప్రధాని మాట్లాడతారు. ఆ తరువాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్, తర్వాత భారత ప్రధాని మోదీ ప్రసంగించాల్సి ఉంది. అయితే ఈ సమావేశాలకు మోదీ హాజరు కావడం లేదని ప్రభుత్వ కార్య వర్గం తెలిపింది. ఆయన స్థానంలో విదేశాంగ శాఖ మంత్రి ఎన్. జైశంకర్ వెళతారని తెలుస్తోంది. మరోవైపు ఐరాస సమావేశాల ప్రారంభం ముందు షెడ్యూల్ లో మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ఇజ్రాయెల్, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాధినేతలు కూడా సమావేశాల్లో ప్రసంగించనున్నారు.
మోదీ గైర్హాజరుకు ఇదే కారణం..
రష్యా నుంచి మురు దిగుమతి చేసుకుంటూ ఉక్రెయిన్ తో యుద్ధానికి భారత్ ప్రోత్సహిస్తోంది అంటూ ట్రంప్ 50 శాతం సుంకాలను విధించారు. లాస్ట్ మంత్ 27 నుంచి అవి అమల్లోకి వచ్చాయి. దీని తరువాత కూడా భారత్ ఎక్కడా తగ్గకపోవడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మింగుడు పడడం లేదు. అందుకే సుంకాల గురించి రోజూ ఏదో ఒక అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. ఇండియాను భయపెట్టాలని చూస్తున్నారు. తాజాగా ఆ దేశంపై ఇంకా పూర్తి స్థాయిలో ఆంక్షల మోత మోగించలేదని చెప్పుకొచ్చారు ట్రంప్. కేవలం సెకండరీ టారిఫ్ లను మాత్రమే విధించానని...ఇంకా రెండు, మూడు విడతలున్నాయని చెప్పారు. దానికి తోడు చైనా, భారత్, బ్రెజిల్ లు అమెరికాను చంపేస్తున్నాయి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ దేశం పూర్తిగా సుంకాలు ఎత్తేస్తానని ముందుకు వచ్చింది కానీ.. అంతకు ముందు ఏకపక్షంగా ఉండేదని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాకనే భారత్ తో వాణిజ్య ఒప్పందాల విషయంలో మార్పును తీసుకువచ్చానని చెప్పారు. యూఎస్ దిగుమతులపై భారత్ విధిస్తున్న భారీ సుంకాలను ఇక మీదట ఒప్పుకునేది లేదని అన్నారు. దానికి తగ్గట్టుగానే అమెరికా కూడా టారిఫ్ లను విధించిందని చెప్పుకొచ్చారు. తాము భారత్‌తో పెద్దగా వ్యాపారం చేయడం లేదు కానీ, వారు మాతో చేస్తున్నారని అన్నారు. మరోవైపు తమ దేశానికి భారత్ దూరం కావడం బాధాకరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్లనే అలా చేశామని చెప్పుకొచ్చారు. నిజానికి భారత ప్రధాని మోదీతో నేను చాలా బాగా కలిసిపోయాను. రెండు నెలల క్రితం ఆయన వచ్చినప్పుడు కూడా బాగా మాట్లాడుకున్నాము అని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడి ఈ ప్రవర్తన, అదనసు సుంకాల కారణంగానే భారత ప్రధాని మోదీ ఐక్యరాజ్య సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కలవాల్సి ఉంటుందని...దానికి ప్రధాని సిద్ధంగా లేరని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా ముందు తగ్గేదే లేదని అంటున్నారు.
Also Read: SIIMA 2025: దుబాయ్ లో కన్నుల పండుగగా సైమా..అవార్డులు కొల్లగొట్టిన పుష్ప-2, కల్కి