PM Modi : ప్రధాని మోదీ కీలక నిర్ణయం...రూ. 1500 కోట్లు రిలీజ్!

దేశ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని వరదలు,వర్షాల ప్రభావిత ప్రాంతాలను వైమానిక సర్వే నిర్వహించిన మోదీ.. నష్టాన్ని అంచనా వేశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు రూ. 1500 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

New Update
pm modi

దేశ ప్రధాని మోదీ(PM Modi) కీలక నిర్ణయం తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) లోని వరదలు,వర్షాల ప్రభావిత ప్రాంతాలను వైమానిక సర్వే నిర్వహించిన మోదీ.. నష్టాన్ని అంచనా వేశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు రూ. 1500 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మృతుల బంధువులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా,గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందజేయాలని అధికారులను ప్రధాని ఆదేశించారు. ప్రధానమంత్రి బాధిత కుటుంబాలను కలిసి సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం NDRF, SDRF ఆప్దా మిత్ర స్వచ్ఛంద సేవకుల సిబ్బందిని కూడా కలిసి, వారి ప్రయత్నాలను అభినందించారు. 

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు(Landslides) విరిగిపడటం వల్ల ఈ మధ్య కాలంలో తీవ్ర నష్టం సంభవించింది.  జూన్ చివరి నుండి ఇప్పటివరకు వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలలో 78 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 50 మంది వర్షాల కారణంగా, 28 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. ఇంకా 37 మంది గల్లంతైనట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.400 కోట్ల నుండి రూ.2,394 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. అనేక వంతెనలు, రహదారులు కొట్టుకుపోయాయి. దాదాపు 396 రోడ్లు మూసివేశారు, వాటిలో రెండు జాతీయ రహదారులు కూడా ఉన్నాయి.

Also Read :  విషాదం.. ముగ్గురు జవాన్లు మృతి

భారీ వర్షాలు కురిసే అవకాశం

ఇంకా భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. కాంగ్రా, సిర్మౌర్, మండి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు నదుల సమీపంలోకి వెళ్లవద్దని, బలహీనమైన నిర్మాణాలలో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మండి, కుల్లు జిల్లాలలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ ప్రాంతాల్లో బియాస్ నది ఉగ్రరూపం దాల్చింది. కిరాత్‌పూర్-మనాలి జాతీయ రహదారిపై నష్టం జరగడంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. మండి జిల్లాలో 179, కులు జిల్లాలో 71 రోడ్లు మూసివేశారు. 

Also Read :  ఆశ లేకపోతే.. జీవితమే లేదు: సీఎం పోస్ట్‌పై డీకే సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు