Putin-Trump: ట్రంప్‌ను జోకర్ చేసిన పుతిన్.. మోదీ, జిన్‌పింగ్‌పై ప్రశంసలు

SCO భేటీలో పుతిన్ ట్రంప్‌ను జోకర్ చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ఈ సదస్సులో ప్రస్తావించిన పుతిన్ అసలు ట్రంప్ పేరెత్తలేదు. యుద్ధం ఆపేందుకు భారత్, చైనా కృషి చేస్తున్నాయంటూ ప్రశంసించారు.

New Update
Putin did not mention Trump's name in SCO meeting, Praises Modi and jinping

Putin did not mention Trump's name in SCO meeting, Praises Modi and jinping

చైనాలోని తింజియన్ వేదికగా షాంఘై సహకార సదస్సు(china sco summit 2025) జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి ప్రధాని మెదీ(PM Modi), రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. అయితే ఈ భేటీలో పుతిన్ ట్రంప్‌ను జోకర్ చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ఈ సదస్సులో ప్రస్తావించిన పుతిన్ అసలు ట్రంప్ పేరెత్తలేదు. యుద్ధం ఆపేందుకు భారత్, చైనా కృషి చేస్తున్నాయంటూ ప్రశంసించారు. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చాలని పశ్చిమ దేశాలు ప్రయత్నించాయని.. అందుకే ఈ సంక్షోభం తలెత్తిందని పేర్కొన్నారు.

Also Read: అధికారిక ప్రకటన.. 800లకు పైగా మృతి, 2800 మందికి గాయాలు

Putin Did Not Mention Trump's Name In SCO Meeting

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine War) ఆపేందుకు తానే ప్రయత్నిస్తున్నాని ట్రంప్(Donald Trump) గత కొంతకాలంగా చెప్పుకుంటూనే ఉన్నారు. ఇటీవల పుతిన్, అలాగే అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కూడా ఆయన చర్చలు జరిపారు. అయినప్పటికీ ఈ ప్రయత్నాలు ఫలించలేదు. మళ్లీ ఎప్పటిలాగే రష్యా, ఉక్రెయిన్ ఒకదానికొకటి కాల్పులు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే SCO సదస్సులో పుతిన్ మోదీ, జిన్‌పింగ్ మాత్రమే యుద్ధం ఆపేందుకు కృషి చేశారని అన్నారు. అసలు ట్రంప్ ఊసెత్తకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: ట్రంప్ తిక్క కుదిరింది.. విదేశీ విద్యార్థులు రాకపోవడంతో రూ.60 వేల కోట్ల నష్టం!

మరోవైపు మోదీ-పుతిన్ సమావేశంతో అమెరికా కాళ్లబేరానికి వచ్చింది. ఇండియా తమకు మిత్ర దేశమంటూ అమెరికా మంత్రి రూబియో ట్వీట్ చేశారు. మోదీతో దోస్తీకి సిద్ధమంటూ పేర్కొన్నారు. ఈ నెలలో ఇరుదేశాల సమావేశం ఉందన్నారు. భారత్-అమెరికా సంబంధాలు బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యాపారాలు, రక్షణ, ద్వైపాక్షిక అంశాలపై చర్చలు ఉంటాయని చెప్పారు. ఇరుదేశాల ప్రజల మధ్య నెలకొన్న స్నేహమే మా సహకారానికి పునాదులుగా మారుతోందని రాసుకొచ్చారు. 

Also Read: పరువు పోయిందిగా.. పాక్‌ ప్రధానిని పట్టించుకోని మోదీ

మరోవైపు SCO భేటీకి ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే కారులో వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రధాని మోదీ ఎక్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. 'SCO సదస్సు వేదిక వద్ద ప్రోసీడింగ్ ముగిసిన అనంతరం పుతిన్, నేను కలసి ఒకే కారులో ద్వైపాక్షిక భేటీ వేదిక దగ్గరికి చేరుకున్నాం. ఎప్పుడూ కూడా ఇద్దరి మధ్య చర్చలు లోతుగా జరుగుతాయని'' పేర్కొన్నారు. 

Also Read: అధికారిక ప్రకటన.. 800లకు పైగా మృతి, 2800 మందికి గాయాలు

ఇదిలా ఉండగా అమెరికా భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు అదనంగా 25 శాతం టారిఫ్‌ను ఇటీవలే ట్రంప్‌ విధించారు. అయినప్పటికీ కూడా భారత్‌ ఏమాత్రం వెనకడుగుడు వేయడం లేదు. ఈ టారిఫ్‌ల వల్ల భారత్‌కు అంతగా నష్టమేమి జరగదని తేల్చిచెప్పింది. అంతేకాదు సెప్టెంబర్‌లో రష్యా నుంచి చమురు దిగుమతిని మరో 10 నుంచి 20 శాతం వరకు పెంచేందుకు ప్లాన్‌ చేస్తోంది. 

Advertisment
తాజా కథనాలు