/rtv/media/media_files/2025/02/20/qxUY8H7yWzY9l1eUrffX.jpg)
Tariffs On Pharma
భారత్ పై అమెరికా మొదట 25 శాతం సుంకాలు విధించింది. అక్కడితో ఊరుకోకుండా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నారు అంటూ మరో 25 శాతం అదనపు సుంకాలను బాదేసింది. గత నెల 27 నుంచి అవి కూడా అమల్లోకి వచ్చాయి. ఈ దెబ్బకు భారత్ దిగి వస్తుంది. తాము చెప్పినట్టు వింటుంది అనుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కానీ భారత్...అమెరికా సుంకాలను ఏం పట్టించుకోలేదు. వాటిని ధీటుగా ఎదుర్కొంది. అమెరికా ఒక్కటే కాకుండా ఇతర దేశాలకూ తన వాణిజ్యాన్ని విస్తరించేలా ప్లాన్ చేసుకుంది. ముఖ్యంగా చైనా, రష్యా, జపాన్, మిడిల్ ఈస్ట్ లతో దోస్తీ చేసింది. దానికి తగ్గట్టే భారత ప్రధాని మోదీ(PM Modi) వరుసగా పర్యటనలు కూడా చేశారు. పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఇదంతా అమెరికాకు కంటగింపుగా మారింది. ఎలా అయినా తమ వస్తువులను ఇండియాకు అంటగడదామని అనుకుంది. కానీ మన దేశం ససేమిరా అనేసరికి ఏం చేయాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇప్పుడు అదే కుళ్ళుతో మరో సారి టార్గెట్ చేయడానికి రెడీ అయ్యారు ట్రంప్.
Also Read : నా ఆరోగ్యం పై వచ్చినవన్ని వదంతులే.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్
ఫార్మాపై డబులు టారిఫ్ లు..
ఇప్పటి వరకు విధించిన సుంకాలు ఒక ఎత్తైతే...ఇక మీద వచ్చేవి మరో ఎత్తని అంటున్నారు ట్రంప్. భారత్ పై ఇప్పటి వరకు 50 శాతం సుంకాలను(donald trump tariffs on india) మాత్రమే అమలు చేశారు. కానీ ఇప్పుడు ఫార్మా దిగుమతులపై ఏకంగా 200శాతం సుంకాలను విధించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటి వరకు విధించిన సుంకాలు ఇండియాను అంత ఎఫెక్ట్ ఏమీ చేయలేదు. కానీ భారత్ ఫార్మా మెయిన్ గా అమెరికా మీదనే ఆధారపడింది. దాదాపు జెనరిక్ మెడిసిన్స్ తో సహా మొత్తం సరుకు అక్కడికే వెళుతుంది. ఇప్పుడు కనుక ఫార్మాపై ట్రంప్ 200 శాతం సుంకాలు అమలు చేశారంటే మాత్రం భారత్ కు చావు దెబ్బే అవుతుంది. ఈ విషయం ట్రంప్ యంత్రాంగానికి బాగా తెలుసు. అందుకే ఈ డబుల్ టారిఫ్ ప్రతిపాదనను తీసుకువచ్చింది. అయితే మళ్ళీ కొత్త టారిఫ్ లు అన్ని రకాల మెడిసిన్స్ మీద ఉండదని..కొన్నింటి మీద మాత్రమే విధిస్తారనే వాదన కూడా వినిపిస్తోంది.
అంత తేలికేమీ కాదు..
ట్రంప్(Donald Trump) యంత్రాంగం ఫార్మా(Pharma) దిగుమతులపై 200 సుంకాల ప్రతిపాదన అయితే తీసుకువచ్చింది కానీ...దానికి అమలు చేయడం అంత సులువేమీ కాదని అంటున్నారు. ఎందుకంటే భారత్ నుంచి ఎగుమతి అవుతున్న మందులు అమెరికాలో అస్సలు తయారవ్వడం లేదు. ఇప్పటికిప్పుడు వారు తయారు చేయడానికి పూనుకున్నా..కనీసం మూడేళ్లు పడుతుంది. ఈ లోపు భారత్ ఎగుమతులను ఆపేస్తే యూఎస్ కు ఆ మందులు దొరక్క నానా కష్టాలు పడాలి. ఈ 200 శాతం టారిఫ్ ల వల్ల భారత్ కు ఎంత నష్టమూ...అమెరికాకు కూడా అంతే నష్టం. అలాగే ఉత్పత్తి వ్యయం మన దేశంతో పోలిస్తే కనీసం 30 నుంచి 40 శాతం పెరుగుతుంది. కంపెనీలు ఈ భారాన్ని వినియోగదారులకే బదిలీ చేయాల్సి ఉంటుంది. దాంతో అమెరికాలో ఆరోగ్య బీమా ప్రీమియంలు పెరిగి పోతాయని చెబుతున్నారు. దాంతో పాటూ భారత్ నుంచి సప్లై తగ్గిపోయి అమెరికాలో మందుల కాస్ట్ ఎక్కువై పోతుంది. అదికూడా 40 నుంచి 56 శాతం వరకూ పెరుగుతాయి. ఇది అక్కడ ప్రజలపై భారీ భారమే అవుతుంది. ఈ అన్ని కారణాల వల్లా ఫార్మా దిగుమతులపై సుంకాలను పెంచరని చర్చ నడుస్తోంది.
Also Read: GST Rates: ఢిల్లీలో జీఎస్టీ సమావేశం..తగ్గనున్న నిత్యావసర వస్తువుల ధరలు