ISRO: ఇస్రో మాజీ ఛైర్మన్ కన్నుమూత!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ ఛైర్మన్ డా.కృష్ణస్వామి కస్తూరి రంగన్ కన్నుమూశారు.ఆయన హయంలో ఇస్రో తొలి లూనార్ మిషన్‌కు అడుగులు పడ్డాయి. 9 సంవత్సరాల పాటు ఇస్రో ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ ఛైర్మన్ డా.కృష్ణస్వామి కస్తూరి రంగన్ కన్నుమూశారు.ఆయన హయంలో ఇస్రో తొలి లూనార్ మిషన్‌కు అడుగులు పడ్డాయి. 9 సంవత్సరాల పాటు ఇస్రో ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు.
ప్రముఖ కోలీవుడ్ నటుడు, పవన్ కల్యాణ్ గురువు 'షిహాన్ హుస్సేనీ' (60) కన్నుమూశారు. కొద్దిరోజులుగా లుకేమియాతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పవన్‌కు మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్ హుస్సేనీ నేర్పించారు.
హర్యానా మాజీ సీఎం, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూశారు. గురుగ్రామ్‌లోని ఆయన నివాసంలో గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. నాలుగు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని సదాశివనగర్ నివాసంలో తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ సీనియర్ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్(80) నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలో బాధపడుతున్నా అతను రాత్రి 11 గంటల సమయంలో రామాపురంలో మృతి చెందారు. తమిళం, తెలుగుతో పాటు మొత్తం 400కి పైగా సినిమాల్లో నటించారు.
యానిమేటెడ్ కార్టూన్లలో డోరెమాన్ ఒకటి. ఈ డోరెమాన్‌కు వాయిస్ ఇచ్చిన జపనీస్ వాయిస్ ఆర్టిస్ట్ నోబుయో ఒయామా ఇటీవల మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు తాజాగా తెలిపారు. ఆలస్యంగా చెప్పినందుకు ఒయామా అభిమానులకు క్షమాపణలు చెప్పారు.
మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి సాల్సెంగ్ . సి. మారక్ (82) శుక్రవారం కన్నుమూశారు.వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ..తురా సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.మాజీ ముఖ్యమంత్రి మృతికి నివాళులర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది.
అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి చెందారు. గత నెల 30న పురుగుల మందు తాగిన ఆయన.. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. కులవివక్ష, ప్రాంతీయ విభేధాలతో తన భర్తను వేధించారని ఆయన భార్య కృష్ణవేణి ఫిర్యాదులో పేర్కొన్నారు.