/rtv/media/media_files/2025/09/25/writer-kompalli-venkat-goud-passes-away-2025-09-25-13-18-11.jpg)
Writer Kompalli Venkat Goud passes away
Kompelli Venkat Goud : తెలంగాణ సాహితీ లోకం తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ప్రముఖ రచయిత, తెలంగాణ వాది కొంపల్లి వెంకట్ గౌడ్ ఇవాళ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ‘వొడువని ముచ్చట’, ‘నీళ్ల ముచ్చట’, ‘సర్వాయి పాపన్న చరిత్ర’ వంటి పుస్తకాలను రాసిన ఆయన పలువురి ప్రశంసలు పొందారు. రచయితగా గుర్తింపు పొందిన వెంకట్ గౌడ్ తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జీవితం, అనుభవాలను ‘వొడువని ముచ్చట’ పుస్తక రూపంలో తీసుకొచ్చారు. అది ఎంతగానో ప్రాచుర్యం పొందింది. అలాగే రాష్ట్రానికి చెందిన నీటి పారుదల రంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఆర్.విద్యాసాగర్ రావు ఆలోచనలను ‘నీళ్ల ముచ్చట’ పేరుతో పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. ఇక ప్రముఖ సాహితీవేత్త నల్గొండకు చెందిన బహుభాషవేత్త నోముల సత్యనారాయణ వంటి ప్రముఖుల జీవితాలను కూడా వెంకట్ గౌడ్ గ్రంథస్తం చేశారు.
వెంకట్ గౌడ్ జీవితకాలమంతా తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెంకట్ గౌడ్ అలుపెరుగని కృషి చేశారు. ఎక్కడ తెలంగాణ వాదానికి అవమానం జరిగిన ఆయన జీర్ణించుకోలేకపోయేవారు. తనదైన వ్యక్తిత్వంతో ఒంటరిగానైన దాన్ని ఎదుర్కొనడానికి సిద్ధమయ్యేవారు. తన రచనల ద్వారానే కాకుండా భావాజాలం ద్వారా బడుగు బలహీనవర్గాలకు అన్ని విధాలుగా అభ్యున్నతి కలగాలన్న ఆలోచన విధానంతో ఆయన తన సాహితీ ప్రయాణాన్ని సాగించారు. బడుగులు ఆశాజ్యోతి గౌడన్నల ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను అక్షరబద్ధం చేయడం ద్వారా బడుగుల ఆత్మగౌరవాన్ని ఎలిగెత్తి చాటారాయన. తెలంగాణ తత్వం, తెలంగాణ వాదం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిరంతరం తపించిన నిఖార్సయిన ఉద్యమకారుడు కొంపెల్లి వెంకట్ గౌడ్. కొన్ని విషయాల్లో ఆయన పలు విమర్శలకు గురయినప్పటికీ తనదైన పంథాను మార్చుకోకుండా చివరి వరకు అదే ఒరవడితో ముందుకు సాగారు. తెలంగాణ సాహిత్యాన్ని కొంతపుంతలు తొక్కించడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయం.
ఒడువని దుంఖం
కాగా కొంపెల్లి వెంకట్ గౌడ్ మృతి తెలంగాణ సాహితీ లోకానికి తీరని దుంఖమని తెలంగాణ తొలిముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దవాణాకలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడవటం తనను కలిచివేసిందని కేసీఆర్ సంతాపం తెలిపారు. ‘వొడువని ముచ్చట’, ‘నీళ్ల ముచ్చట’, ‘సర్వాయి పాపన్న చరిత్ర’ వంటి పుస్తకాలను ఆయన రాశారని గుర్తు చేశారు. ప్రముఖ రచయిత, తెలంగాణ మట్టిబిడ్డ కొంపెల్లి వెంకట్ గౌడ్ ఇక లేరన్న వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేటీఆర్ అన్నారు. వారి హఠాన్మరణం తెలంగాణ సాహిత్య రంగానికి, తెలంగాణ ప్రజలకు తీరని లోటని చెప్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రచయిత కొంపెల్లి వెంకట్ గౌడ్ హఠాన్మరణం బాధాకరమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆయ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ మనో గతానికి ‘వొడువని ముచ్చట’గా, ఆర్. విద్యాసాగర్ రావు ఆలోచనలకు ‘నీళ్ల ముచ్చట’గా పుస్తక రూపం ఇచ్చారని తెలిపారు. గౌడన్నల ఆత్మగౌరవాన్ని తన రచనల ద్వారా చాటి, సర్వాయి పాపన్న చరిత్రను అక్షరబద్దం చేసి ప్రజలకు అందించారన్నారు. తెలంగాణ తత్వం, ఉద్యమ భావజాలాన్ని తన కలంలో నింపుకున్న కొంపెల్లి వెంకట్ గౌడ్ మృతి తెలంగాణ సాహిత్య రంగానికి తీరని లోటని చెప్పారు.
Also Read : నిరుద్యోగులకు దసరా కానుక.. 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలివే!