Delhi Ganesh: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

ప్రముఖ సీనియర్ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్‌(80) నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలో బాధపడుతున్నా అతను రాత్రి 11 గంటల సమయంలో రామాపురంలో మృతి చెందారు. తమిళం, తెలుగుతో పాటు మొత్తం 400కి పైగా సినిమాల్లో నటించారు.

New Update
Delhi Ganesh

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్‌(80) నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్న గణేష్ నిన్న రాత్రి 11 గంటల సమయంలో రామాపురంలో మృతి చెందారు. ఇతని మృతితో తమిళ చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

ఇది కూడా చూడండి: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్

400కి పైగా సినిమాల్లో..

ఢిల్లీ గణేష్ ఇండియన్ 2, కాంచన-3, అభిమన్యుడు వంటి తమిళ సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాల్లో కూడా నటించారు. విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కీలక పాత్రలు పోషించాడు. దాదాపుగా 400కి పైగా సినిమాల్లో ఇతను నటించారు. అగ్ర కథానాయకులతో కూడా ఢిల్లీ గణేశ్‌ నటించారు. ఇతని మృతిపై ప్రముఖులు, సినీ నటులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

ఇది కూడా చూడండి:Amla: కార్తీక మాసంలో ఇంట్లో ఈ మొక్క నాటితే.. ఐశ్వర్య సిద్ధి తధ్యం!

ఇది కూడా చూడండి: Green Tea: ఉదయాన్నే గ్రీన్ టీ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?

ఇది కూడా చూడండి: ఇక్కడ చేసిన ఫుడ్ తిన్నారో.. ఒక్కసారికే పైకి పోవడం గ్యారెంటీ!

Advertisment
తాజా కథనాలు