కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని సదాశివనగర్ నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తుల కోసం 34 ప్రత్యేక రైళ్లు..ఏ రూట్లో ఆగుతాయో తెలుసా #SMKrishna is no more. The stalwart of Karnataka politics passed away around 3 AM today. A true leader, a proud Kannadiga, and a gentleman, his vision was pivotal in the development of #Bangalore as an IT city. pic.twitter.com/SJwXr2cM4N — Vinod (For India) (@onemevinod) December 10, 2024 ఇది కూడా చూడండి: బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి దశాబ్ధాలకు పైగా రాజకీయ అనుభవం ఐదు దశాబ్దాలపై నుంచి కృష్ణకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో అతను కీలకంగా వ్యవహరించారు. కర్ణాటకలోని మండ్య జిల్లా సోమనహళ్లిలో జన్మించిన కృష్ణ 1962లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మద్దూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 30 ఏళ్లకే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది కూడా చూడండి: Asad: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్! కృష్ణ 1999-2004 సమయంలో కర్ణాటక 16వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పుడే బెంగళూరులో ఐటీ రంగం అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆ తర్వాత 2004 డిసెంబర్ నుంచి 2008 మార్చి వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత యూపీఏ హయాంలో 2009- 2012 మధ్య విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. అలాగే కర్ణాటక శాసనసభ స్పీకర్‌గా కూడా పనిచేశారు. ఇతను చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 2023లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక!