BIG BREAKING: పవన్ కల్యాణ్ గురువు మృతి!

ప్రముఖ కోలీవుడ్ నటుడు, పవన్ కల్యాణ్‌ గురువు 'షిహాన్ హుస్సేనీ' (60)  కన్నుమూశారు. కొద్దిరోజులుగా లుకేమియాతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పవన్‌కు మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్ హుస్సేనీ నేర్పించారు.

New Update
actor died

Kollywood actor Shihan Hussaini passed away

BIG BREAKING: ప్రముఖ కోలీవుడ్ నటుడు, పవన్ కల్యాణ్‌ గురువు 'షిహాన్ హుస్సేనీ' (60)  కన్నుమూశారు. కొద్దిరోజులుగా లుకేమియాతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పవన్‌కు మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్ హుస్సేనీ నేర్పించారు. ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటూనే పవన్ బ్లాక్ బెల్ట్ సాధించారు. ఇక హుస్సేనీ అకాల మరణంపై సినీ నటులు, ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. హుస్సేని అంత్యక్రియలు చెన్నైలోనే కుటుంబ సభ్యుల సమక్షంలో జరుగనున్నట్లు తెలుస్తోంది. 

షిహాన్ హుస్సేని పేరు మార్షల్ ఆర్ట్స్ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇక అంతర్జాతీయ స్థాయిలోపై  మార్షల్ ఆర్ట్స్‌లో రాణించారు హుస్సేనీ. మార్షల్ ఆర్ట్స్‌లో అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. కరాటే, తాయ్‌క్వాండో, కిక్ బాక్సింగ్ వంటి పోరాట కళల్లో ప్రావీణ్యం సాధించి, ఎంతో మందికి మార్గదర్శకుడిగా నిలిచారు. ఫైట్ మాస్టర్ మాత్రమే కాదు, అనేక హిట్స్ సినిమాల్లో నటుడిగానూ అలరించారు. ఆయన మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ లో ఎంతోమందికి శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా టాలీవుడ్ నటుడు పవన్ కల్యాణ్‌ కు మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ నేర్పించారు. 'తమ్ముడు', 'బద్రి', 'జానీ' వంటి చిత్రాల్లో పవన్ చూపించిన ఫైట్ మూమెంట్స్ హుస్సేని నేర్పించినవే. 

ఇది కూడా చూడండి: Nicholas Pooran : భయంకరమైన హిట్టర్.. 29 ఏళ్లకే 600 సిక్సులు!

షిహాన్ హుస్సేని మరణ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు, శిష్యులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 'హుస్సేని సార్ లాంటి గురువులను కోల్పోవడం బాధాకరం. ఆయన మార్గదర్శకత్వంలో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ నా కెరీర్‌లో ఎంతో ఉపయోగపడ్డాయి. అని పవన్ కళ్యాణ్ తన సంతాప తెలిపారు. 

ఇది కూడా చూడండి: వీడు మగాడ్రా బుజ్జి.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి..జట్టును గెలిపించి!

 kollywood | actor | passed-away | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు