BCCI: పాక్కి వెళ్లేది లేదు.. ఐసీసీకి తేగేసి చెప్పిన బీసీసీఐ
పాకిస్థాన్ దేశం ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే టీమిండియా పాకిస్థాన్ వెళ్లే ప్రసక్తి లేదని ఐసీసీకి బీసీసీఐ లేఖ రాసింది. ఉగ్రవాద చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఏడాది నుంచి జరిగిన ఉగ్రవాద ఘటనలను కూడా బీసీసీఐ ఆ లేఖలో పేర్కొంది.