/rtv/media/media_files/2025/04/28/noA8gQqIgqEbuMVQnpdK.jpg)
pak-blast
Pakistan Bomb Blast: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. దక్షిణ వజీరిస్తాన్(South Waziristan) జిల్లా ప్రధాన కార్యాలయం అయిన వానాలోని స్థానిక శాంతి కమిటీ కార్యాలయంలో బాంబు పేలుడు సంభవించింది. చాలామంది శిథిలాల కింద చిక్కుకున్నారు.ఇప్పటివరకు, పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ సంస్థ ప్రకటించలేదు. రెస్క్యూ బృందాలు, స్థానికులు సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
Also Read: వాడో జోకర్.. మోదీజీ పాకిస్తాన్‌ను FATF బ్లాక్‌లిస్ట్‌లో చేర్చండి: అసదుద్దీన్ ఒవైసీ
Explosion rocks a meeting of a local peace committee in Pakistan's South Waziristan region, 7 killed.
— Vani Mehrotra (@vani_mehrotra) April 28, 2025
The explosion caused a portion of the building where the meeting was taking place to collapse.
Here's a purported video of the blast.#Pakistan #Waziristan pic.twitter.com/S0kK33wWlE
Also Read: ఇండియాతో యుద్ధం వద్దు.. పాక్ మాజీ ప్రధాని కీలక సూచనలు
భవనం ధ్వంసం
పేలుడుకు కారణమైన వారిని గుర్తించడానికి వివిధ కోణాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. పేలుడు చాలా తీవ్రంగా ఉండటం వల్ల శాంతి కమిటీ కార్యాలయ భవనం ధ్వంసమైందని, శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు. 54 మంది టెర్రరిస్టులను చంపామని పాక్ ఆర్మీ ప్రకటించిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకుంది. టెర్రరిస్టులను చంపిన ప్రాంతానికి దగ్గర్లోనే పేలుళ్లు సంభవించాయి. ఉగ్రవాదుల పనే అని పాక్ ఆర్మీ అనుమానం వ్యక్తం చేస్తోంది. కాగా 2022 నవంబర్ లో నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత, పాకిస్తాన్‌లో ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సులలో ఉగ్రవాద సంఘటనలు పెరిగాయి.
Also Read: భారత్, పాక్ మధ్య అణు యుద్ధం.. ఎవరి బలం ఎంత?
Also Read: వాడో జోకర్.. మోదీజీ పాకిస్తాన్‌ను FATF బ్లాక్‌లిస్ట్‌లో చేర్చండి: అసదుద్దీన్ ఒవైసీ