/rtv/media/media_files/2025/04/28/naHJxPBQw5O3gqxrHcAr.jpg)
Pahalgam Attack
Pakistan : కశ్మీర్ లో పర్యాటకులపై కాల్పులకు తెగపడి 28 మందిని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్యను ప్రపంచమంతా ఖండించింది. ఈ చర్యతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే ఉగ్రవాదుల ఏరివేత పేరుతో భారత్ తమపై దాడి చేసే అవకాశం ఉందని పాకిస్థాన్ కు భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో సైనికులను పెంచడంతో పాటు యుద్ధట్యాంకులను మోహరిస్తోంది. కశ్మీర్‌లో పర్యాటకులపై ఇటీవల జరిగిన ఉగ్రదాడి, ఆపై సరిహద్దుల్లో చోటుచేసుకున్న కాల్పుల నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ కీలక సైనిక చర్యలకు ఉపక్రమించింది. చైనా నుంచి సేకరించిన శక్తివంతమైన ఎస్ హెచ్-15 సెల్ఫ్-ప్రొపెల్డ్ ఆర్టిలరీ (స్వయంచోదక శతఘ్ని) వ్యవస్థలను పాకిస్థాన్ సైన్యం భారత సరిహద్దు సమీప ప్రాంతాలకు తరలించింది.
Also Read: Elon Musk: మస్క్...పరపతి పెరిగింది కానీ...పాపులారిటీ తగ్గింది!
పాకిస్థాన్ బలగాలు భారీ చైనా ఆయుధాలను తరలిస్తున్నట్లు కనపడుతున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కశ్మీర్ ఘటన తర్వాత రెండు రాత్రుల పాటు సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు జరిగిన అనంతరం ఈ ఆయుధాల మోహరింపు జరగడం గమనార్హం. ఈ పరిణామం సరిహద్దుల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు అద్దం పడుతోంది. తాజా నివేదికల ప్రకారం, చైనా నుంచి అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉంది. ఇస్లామాబాద్‌కు బీజింగ్ పెద్ద ఎత్తున సైనిక సహకారం అందిస్తోందనే వాస్తవాన్ని ఈ ఎస్ హెచ్-15 ఫిరంగుల మోహరింపు మరోసారి స్పష్టం చేస్తోంది. ఇరు దేశాల మధ్య సైనిక సంబంధాలు మరింత బలపడుతున్నాయని ఈ పరిణామం సూచిస్తోంది.
Also Read: Pakistan-India-China: భారత్-పాక్ పరిణామాలను చాలా క్షుణంగా పరిశీలిస్తున్నాం!
చైనా తయారీ ఎస్ హెచ్-15 ఫిరంగులు అధునాతనమైనవి, వేగంగా కదిలించగల సామర్థ్యం కలిగినవిగా రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు. పాకిస్థాన్ తన సరిహద్దుల వద్ద చైనా ఆయుధాలను మోహరించడంపై భారత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. అవసరమైతే మన ఆయుధ సామర్ధ్యాన్ని ప్రదర్శించడానికి కూడా వెనుకాడమని భారత్ హెచ్చరించింది.
Also Read: Pak-India: పాక్‌కు చావు దెబ్బ.. ఔషధాల కొరతతో హెల్త్ ఎమర్జెన్సీ!