Operations Sindoor: గర్వపడుతున్నా.. ఆపరేషన్ సిందూర్ పై కేసీఆర్ ఎమోషనల్ పోస్ట్!
ఆపరేషన్ సిందూర్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి ఒక భారతీయుడిగా తాను గర్వపడుతున్నానన్నారు.
ఆపరేషన్ సిందూర్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి ఒక భారతీయుడిగా తాను గర్వపడుతున్నానన్నారు.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాలు క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాల పర్యటనను రద్దు చేసుకున్నారు. భారత్ పాక్‌పై దాడి చేపట్టడంతో యూరప్ పర్యటనను మోదీ రద్దు చేశారు. మే నెల మధ్యలో మళ్లీ ఈ పర్యటనను ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తోంది.
పహెల్గాం ఉగ్రదాడులకు ప్రతీకారంగా కేవలం 23 నిమిషాల్లో భారత్ తన ఆపరేషన్ సిందూర్ ను పూర్తి చేసింది. పాకిస్థాన్ తో పాటు ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న 9 ఉగ్రస్థావరాలపై మెరుపుదాడి చేసింది. ఈ దాడుల్లో 90 మందికి పైగా ఉగ్రవాదులు మృతిచెందినట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. త్రివిధ సైన్యాల ధైర్య నాయకత్వానికి మరియు వారికి అండగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక ధన్యవాదాలు.. అంటూ తన X ఖాతాలో పోస్ట్ చేశారు.
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్‌పై దాడులు నిర్వహించగా 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ముఖ్యంగా ఉగ్రవాద సంస్థ జైషే నాయకుడు, అజార్ మసూద్‌తో పాటు అతని కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఉగ్రదాడిలో అతని కుటుంబానికి చెందిన 14 మంది సభ్యులు మృతి చెందారు.
భారత్ ప్రతీకార దాడితో పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ కొంత బయపడినట్లు తెలుస్తోంది. భారత ఆర్మీ మంగళవారం రాత్రి పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేయడంతో కొంత వెనక్కు తగ్గింది. పాకిస్థాన్ కాల్పులు విరమించుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి 15 నిమిషాల ముందు ఇండియన్ ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది. ‘విజయం కోసం సాధన.. దాడికి సిద్ధం’ అని ఓ వీడియోను షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పాక్‌కు సరిగ్గా బుద్ది చెప్పిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ గురించి భారత సైన్యం ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్లో ఇద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారు. ఒకరు సోఫియా ఖురేషి, మరొకరి పేరు వ్యోమికా సింగ్. సోఫియా ఖురేషి భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ కాగా, వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్.
పహల్గాంలో దాడిపై పాక్ కు భారత్ గట్టి బుద్ది చెప్పింది.ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోని 9 ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. దీంతో పాకిస్థాన్ అప్రమత్తమైంది. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. పాక్‌లోని లాహోర్, సియాల్‌కోట ఎయిర్‌పోర్ట్‌లు మూసివేసింది.