Operation Sindoor :పహెల్గాం లో ఉగ్రదాడిలో 26 మందిని కోల్పోయిన కుటుంబ సభ్యులతో పాటు దేశమంతా ఊహించని విధంగా భారత్ పాక్ పై మెరుపుదాడులు చేసింది. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా సాగిన దాడుల్లో సుమారు 200 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. ప్రపంచ మంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో పాకిస్థాన్ పై భారత్ విరుచుకుపడింది. పక్కా ప్లాన్ తో అనుకున్న ముహూర్తానికి భారత్ వైమానిక దళం ఉగ్రవాద క్యాంపుల పైన క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. భారత్ చర్యను దేశ ప్రజలంతా ముక్తకంఠంతో అభినందిస్తున్నారు. భారత సైన్యానికి సెల్యూట్ అంటూ నినదిస్తున్నారు.
మంగళవారం అర్థరాత్రి దాటాక...బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్ గాఢనిద్రలో ఉన్న సమయంలో సరిగ్గా 1.44 నిమిషాలకు ఏకకాలంలో పాకిస్థాన్ లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది.భారత్ సైన్యం పాక్ తో పాటుగా పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను మట్టు బెట్టింది. ఈ తతంగమంతా కేవలం 23 నిమిషాల వ్యవధిలో నే పూర్తయింది. పహెల్గాం దాడి తర్వాత రెచ్చగెట్టే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న పాక్ భారత దాడులను తిప్పికొట్టే పరిస్థితి లేకపోగా.. కనీసం ఒక విమానం కూడా ప్రతిగా పైకి లేవలేదు. 9 ప్రాంతాల్లోనూ ఎక్కడ భారత సైన్యానికి ప్రతిఘటన ఎదురుకాలేదు.
కాగా తొమ్మిది స్థావరాల్లో తలదాచుకుంటున్న జైషే ఈ మహ్మద్, లష్కరే సంస్థల అగ్ర నేతలు హతం అయ్యారు. ఈ దాడులతో పాక్ కు వెన్నులో వణుకు పట్టింది. దాడులను తిప్పి కొట్టే సాహసం చేయలేదు. కాగా, అయితే పాక్ మంత్రులు మాత్రం గొప్పలు పోతున్నారు. తాము భారత్ విమానాలను కూల్చేసామని ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఆ సాహాసం చేయలేకపోయిన పాకిస్తాన్ సరిహద్దుల వద్ద కాల్పులకు పాల్పడుతూ అమాయకులను పొట్టన పెట్టుకుంటోంది. ఈ కాల్పుల్లో 3 గురు పౌరులు చనిపోయినట్లు తెలుస్తోంది.
ఇక, భారత్ సైన్యం ముజఫరాబాద్‌లో 2 దాడులు చేసింది. బహవల్పూర్‌లో మూడవ దాడి చేసింది. కోట్లిలో, చక్ అమ్రు, గుల్పూర్, భింబర్, మురిడ్కే, సియాల్‌కోట్‌లో దాడి చేసినట్లు భారత్ ప్రకటించింది. భవిష్యత్తులో పాక్ నుంచి ఎలాంటి స్పందన ఎదురైనా తిప్పి కొట్టేందుకు భారత్ సమాయత్తం అవుతోంది. అంతేకాదు ఆర్మీకి చెందని అన్ని రకాల అధికారులు వెంటనే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది.