Vizianagaram Terror Case: విజయనగరం ఉగ్ర కుట్ర ...కీలక నిందితుడిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
విజయనగరంలో ఉగ్ర మూలాల కేసులో ఎన్ఐఏ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఇందులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రవాదులకు సహకరించిన కీలక వ్యక్తి ఆరిఫ్ ను అధికారులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ఇతను దేశం విడిచి పారిపోతుండగా పట్టుకున్నారు.