Delhi Blast Update: ఢిల్లీ బాస్ట్ కేసులో కొత్త మలుపు.. ఉమర్ తో సంబంధం ఉన్న మరో ఇద్దరి అరెస్ట్

ఢిల్లీ ఎర్రకోట బ్లాస్ లో మరో ఇద్దరిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అదుపులోకి తీసుకున్నారు.ఉమర్ నబీతో నేరుగా సంబంధం ఉన్న రాయ్ పూర్ గ్రామ్ మసీదు మూలానా తయ్యబ్ హుస్సేప్, ఉర్దూ ఉపాధ్యాయుడు రషీద్ లను అరెస్ట్ చేశారు.

New Update
delhi

Delhi Blast Update: ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కు సంబంధించి దేశ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. గత రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో అరెస్ట్ ను చేసింది. ఇందులో భాగంగానే ఈరోజు గురుగ్రామ్‌లోని సోహ్నా సబ్‌డివిజన్‌లోని రాయ్‌పూర్ గ్రామ మసీదు మౌలానా తయ్యబ్ హుస్సేన్, ఉర్దూ టీచర్ రషీద్ లను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ కారు బాంబు ప్రధాన నిందితుడు ఉమర్ నబీ తో ఈ ఇద్దరికీ సంబంధం ఉందని చెబుతున్నారు. ఉమర్(Umar Nabi) దాడికి ముందు రాయ్‌పూర్ మసీదును చాలాసార్లు సందర్శించాడు.

Also Read: జపాన్‌లో ప్రభాస్ హంగామా.. 'బాహుబలి: ది ఎపిక్' రీ–రిలీజ్‌ స్పెషల్!

ఈ మసీదు ఢిల్లీ-ముంబై హైవేపై, నుహ్ సరిహద్దుకు సమీపంలో ఉంది. ఉమర్ విశ్వవిద్యాలయం నుండి పారిపోయి అక్టోబర్ 30న అక్కడికి చేరుకున్నాడు. మౌలానా తయ్యబ్ హుస్సేన్ ఉమర్‌కు మతపరమైన విద్యను అందించగా, ఉర్దూ ఉపాధ్యాయుడు రషీద్ మదర్సా విద్యార్థులకు బోధించాడు. వీరిద్దరూ ఉమర్ తో కలిసి మసీదులో ప్రార్థనలు చేస్తూ, సంభాషిస్తున్న ఆధారాలు లభ్యమయ్యాయని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. 

Also Read: కథ చెబుతానని పిలిచి ఆ డైరెక్టర్ బలవంతం చేసాడు: మౌనీ రాయ్

ముమ్మర తనిఖీలు..

నిన్న ఛత్తీస్ ఘడ్ లో ఇద్దరు మైనర్ బాలురను యాంటీ టర్రరిస్ట్ స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది.  వీరిద్దరికీ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఈ బాలురు పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఐసిస్‌ హ్యాండ్లర్‌ ఆధ్వర్యంలో పని చేస్తున్నారని.. నకిలీ ఐడీల ద్వారా సోషల్ మీడియాలో ఉగ్రవాద, విద్వేష భావజాలం వ్యాప్తి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ తెలిపారు. అంతేకాదు ఈ ఇద్దరు కుర్రాళ్ళు స్థానికంగా ఉన్న మరికొంత మంది బాలురను ఉగ్రవాదం వైపు ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

Also Read: ప్రభాస్ ప్రాజెక్ట్స్ నుండి అందుకే తప్పుకున్నా: దీపికా పదుకొణె

ఢిల్లీలో పేలుడు(delhi blast case) ఘటనపై NIA దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్‌(jaish e mohammed) ఉగ్రవాద సంస్థ భారత్‌ వ్యాప్తంగా భారీ దాడులకు కుట్ర(Pak Terrorists On India) చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందుకోసం ఫిదాయిన్‌ (ఆత్మాహుతి దళం)ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ దాడుల కోసం జైషే సంస్థ నిధులను కూడా సమకూరుస్తున్నట్లు నిఘా అనుమానిస్తున్నాయి.ముజాహిద్‌లకు వింటర్‌ కిట్‌లను అందించేందుకు ఈ విరాళాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఒక్కొక్కరి నుంచి 20వేల పాకిస్థాన్‌ రూపాయలు అంటే భారత కరెన్సీలో రూ.6,400 విరాళంగా సేకరిస్తున్నట్లు తెలిసింది.

Also Read: Delhi Bomb Blast:చెప్పి మరీ దెబ్బ కొట్టాం..ఢిల్లీ పేలుళ్ళపై పాకిస్తాన్ నేత షాకింగ్ కామెంట్స్

Advertisment
తాజా కథనాలు