Anmol Bishnoi: భారత్‌కు వచ్చిన లారెన్స్‌ బిష్ణోయ్ సోదరుడు.. ఇతడి గురించి తెలిస్తే..!

ప్రస్తుతం లారెన్స్‌ బిష్ణోయ్‌ గుజరాత్‌లోని సబర్మతి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతడి తమ్ముడు మరో గ్యాంగ్‌స్టర్‌ అన్మోల్‌ బిష్ణోయ్‌ను అమెరికా బహిష్కరించింది. దీంతో అతడిని తాజాగా భారత్‌కు తీసుకొచ్చారు.

New Update
Anmol Bishnoi, accused in Baba Siddiqui murder, lands in Delhi

Anmol Bishnoi, accused in Baba Siddiqui murder, lands in Delhi

సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) ఇంటి వద్ద కాల్పులు జరగిన అనంతరం దేశవ్యాప్తంగా మారుమోగిన పేరు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌(lawrence-bishnoi). ఆ తర్వాత ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య తర్వాత కూడా బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సంచలనం సృష్టించింది. ప్రస్తుతం లారెన్స్‌ బిష్ణోయ్‌ గుజరాత్‌లోని సబర్మతి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతడి తమ్ముడు మరో గ్యాంగ్‌స్టర్‌ అన్మోల్‌ బిష్ణోయ్‌ను అమెరికా బహిష్కరించింది. దీంతో అతడిని తాజాగా భారత్‌కు తీసుకొచ్చారు. అతడితో పాటు మరో 199 మందిని ఇండియాకు తరలించారు. వీళ్లలో ఇద్దరు పంజాబ్‌ వాంటెడ్ జాబితాలో ఉండగా.. మిగిలిన 197 మంది అక్రమంగా అమెరికాలో ఉంటున్నారు. 

Also Read: ఢిల్లీ ఆత్మాహుతి దాడిపై.. MP అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Anmol Bishnoi Accused In Baba Siddiqui Murder

వీళ్లందరిని తరలిస్తున్న విమానం బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసుతో పాటు పలు కేసుల్లో అన్మోల్ బిష్ణోయ్‌ కీలక నిందితుడిగా ఉన్నాడు. అంతేకాదు గతేడాది ఏప్రిల్‌లో సల్మాన్‌ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరగగా.. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అన్మోల్‌ బిష్ణోయ్‌ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ క్రమంలోనే ముంబయి పోలీసులు అతడిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. 2022లో ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా మర్డర్ కేసులో కూడా అన్మోల్‌ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అయితే సిద్ధూ హత్యకు కొన్నిరోజు ముందే ఫేక్‌ పత్రాలు వాడి అన్మోల్ దేశం విడిచి పారిపోయాడని నిఘా వర్గాలు తెలిపాయి. 

Also Read: పాక్ ప్రభుత్వమే ఉగ్రదాడులు చేయిస్తోంది..ఖైబర్ పఖ్తుంఖ్వా  సీఎం ఆరోపణలు

ఆయా ప్రాంతాల్లో అతడిపై దాదాపు 20 వరకు కేసులు నమోదయ్యాయి. అంతేకాదు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అన్మోల్ గురించి సమాచారం చెప్పిన వాళ్లకి రూ.10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. విదేశాల్లో ఉంటూ అతడు కార్యకలాపాలు నిర్వహిస్తుండేవాడు. అన్మోల్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు ముంబయి పోలీసులు అనేక ప్రయత్నాలు చేశాడు. గతేడాది కూడా అతడు అమెరికా పోలీసులకు చిక్కాడు. దీంతో NIA అధికారులు అమెరికాలో ఉన్న ఎఫ్‌బీఐ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీలతో సంప్రదింపులు జరిపారు. దీంతో అమెరికా అతడిని బహిష్కరించింది. బుధవారం అతడు భారత్‌లో ల్యాండ్ అవ్వగానే NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

Advertisment
తాజా కథనాలు