Delhi Blast Update: ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలక నిందితుడు అరెస్ట్.. పోలీసుల అదుపులో యాసీర్ అహ్మద్ దార్

ఢిల్లీ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కీలక పురోగతిని సాధించింది. ఈ కేసులో అత్యంత కీలక వ్యక్తి అయిన యాసీర్ అహ్మద్ దార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఉమర్ నబీ ఆత్మాహుతి బాంబర్ గా మారడానికి ఇతనే ప్రేరేపించాడని అధికారులు చెబుతున్నారు.

New Update
yasir ahmed

దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన బాంబ్ బ్లాస్ట్ యావత్ దేశాన్ని కుదిపేసింది. అది కూడా ఎర్రకోట వంటి ప్రముఖ ప్రాంతంలో ఈ పేలుడు జరగడం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ఢిల్లీ బాంబు దాడి(delhi blast) వెనుక విస్తృతమైన విదేశీ నెట్ వర్క్ ఉందని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. 2022 కన్నా ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ, పాకిస్తాన్ హ్యాండ్లర్ ఉకాషా ఆదేశాల మేరకు 2022లో టర్కీ(turkey)లో సిరియన్ ఉగ్రవాదిని మిగతా డాక్టర్లతో కలసినట్టు తెలుస్తోంది. టర్కీ సమావేశం తర్వాతనే ఉమర్ ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో జాయిన్ అయ్యాడని ఎన్ఐఏ చెబుతోంది. ఢిల్లీ బాంబ్ దాడి వెనుక విదేశీ హ్యాండ్లర్లను, రాడికలైజేషన్ మార్గాలను, ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌ను కనుగొంది. ఢిల్లీ బాంబర్ ఉమర్, డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ అదీల్ , డాక్టర్ ముజఫర్ రాథర్‌లతో కలిసి టర్కీ వెళ్ళాడు. అక్కడ సిరియన్ హ్యాండ్లర్లు పెద్ద ఆపరేషన్ లో పాల్గొనాలని వారికి ఆదేశించారని దర్యాప్తులో తేలింది. దీనంతటి వెనకా ఉకాషా అనే హ్యాండ్లర్ ఉన్నాడని చెబుతున్నారు. 

ఆత్మాహుతి బాంబర్ గా మారడానికి కారణం ఇతనే..

ఇప్పుడు ఈ కేసులో ఎన్ఐఏ, ఢిల్లీ పోలీసులు కలిసి మరో కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. యాసీర్ అహ్మద్ దార్ ను అదపులోకి తీసుకున్నారు. ఇతను ఢిల్లీ పేలుళ్ల ప్రధాన నిందితుడు ఉమర్ నబీకి ఆశ్రయం ఇవ్వడమే కాక..అతనితో పాటూ మిగతా వారిని ఉగ్రవాదం వైపు మళ్లేలా చేశాడని అధికారులు తెలిపారు. నబీను ఆత్మాహుతి బాంబర్ గా మారమని ఒప్పించారని చెప్పారు. ఉమర్ నబీ ఆత్మాహుతి దాడిని బలిదానం అని మాట్లాడ్డానికి కూడా ఈ యాసీర్ అహ్మదే కారణమని తెలుస్తోంది. 

2023 అక్టోబర్ లో జెఎం-అన్సార్ ఉల్ ఘజ్వత్-ఉల్-హింద్ మాడ్యూల్ ఇజ్రాయెల్‌లో హమాస్ తరహా దాడిని భారత్ లో పునరావృతం చేయాలని కోరుకుంది. డ్రోన్ దాడులను నిర్వహించడం, ఆ తర్వాత అనేక నగరాల్లో ఆత్మాహుతి బాంబర్లు కార్ బాంబులు వేసి దాడులు చేయాలనేది దీని ఆలోచన. ఈ కేసులో ప్రధాన నిందితులతో యాసిర్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు.   వారిలో ఉమర్ ఉన్ నబీతో పాటూ ముఫ్తీ ఇర్ఫాన్ కూడా ఉన్నాడు. 2022 చివరలో ముఫ్తీ ఇర్ఫాన్ డాక్టర్ ముజమ్మిల్‌ను కలిశాడని, ఇది ఈ ఉగ్రవాద సంస్థ ఏర్పడటానికి దారితీసిందని దర్యాప్తులో తేలింది. ఉమర్ ఆఫ్ఘనిస్తాన్‌లో స్థిరపడాలని అనుకున్నాడు, కానీ భారతదేశానికి తిరిగి వెళ్లి "పెద్ద దాడి"కి సిద్ధం కావాలని అతనికి ఆదేశాలు అందాయి. దాడికి వారం ముందు, ముజఫర్ ఆఫ్ఘనిస్తాన్‌కు పారిపోయాడు. ముజఫర్‌ను ప్రకటిత నేరస్థుడిగా ప్రకటించాలని J&K యొక్క ఉగ్రవాద నిరోధక విభాగం SIA శ్రీనగర్ కోర్టులో దరఖాస్తును దాఖలు చేసింది.

Advertisment
తాజా కథనాలు