/rtv/media/media_files/2026/01/13/fotojet-2026-01-13t163031-2026-01-13-16-31-33.jpg)
NIA makes a sensation...searches at an orphanage
Gade Innaiah : మాజీ మావోయిస్టు, మలి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను ఇటీవల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆయన జనగాం జిల్లా జాఫర్‌ఘడ్ మండలంలో నిర్వహిస్తున్న మాఇల్లు అనాథశ్రమంలో ఈరోజు(మంగళవారం) ఉదయం నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు (NIA) సోదాలు నిర్వహిస్తున్నారు.
ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పాటు ఇటీవల మరణించిన పలువురు మావోయిస్టలు అంతిమ సంస్కారాల నేపథ్యంలో మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడరనే ఆరోపణలతో ఆయనను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. కాగా విచారణలో భాగంగా ఆశ్రమంలో ఎన్‌ఐఏ సిబ్బందితో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనాథాశ్రమంలో మంగళవారం ఉదయం నుంచే ఎన్ఐఏ అధికారులు బృందాలుగా విడిపోయి.. ఆశ్రమంలోని రికార్డులు, కంప్యూటర్లు, ఇతర పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. విషయం తెలిసి అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిథులు అక్కడికి చేరుకున్నారు, అయితే సోదాలు జరుగుతున్న సమయంలో సమాచారం బయటకు రాకుండా మీడియాను లోపలికి అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు మంగళవారం ఉదయం నుంచే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ కుషాయిగూడ పరిధిలోని చక్రిపురంలో ఉన్న సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య నివాసం, జనగామలోని ఆయన నిర్వహిస్తున్న మా ఇల్లు అనాథాశ్రమంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. రిమాండ్‌లో ఉన్న ఇన్నయ్యను ఎన్ఐఏ విచారిస్తోంది. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో భాగంగానే ఇన్నయ్యకు సంబంధించిన అనాథాశ్రమంలో జరిగే కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు తదితరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌లో జరుగుతున్న ఈ పరిణామాలు సంచలనం రేపుతున్నాయి. ఎన్ఐఏ అధికారులు ఒక అనాథాశ్రమంపై దృష్టి సారించడం, 'ఉపా' (UAPA) చట్టం కింద చర్యలు తీసుకోవడం ఈ కేసు తీవ్రతను తెలియజేస్తోంది.
కాగా ఇన్నయ్యపై గతంలో నమోదైన ఒక పాత కేసు (ముఖ్యంగా చత్తీస్‌గఢ్ మావోయిస్టు లింకులు) ఆధారంగా ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. మావోయిస్టులకు నిధుల సేకరణ, రిక్రూట్‌మెంట్, సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై ఎన్ఐఏ దృష్టి సారించింది. ఎన్‌ఐఏ అధికారులు గాదె ఇన్నయ్య నివాసంలో తెల్లవారుజాము నుంచే అధికారులు సోదాలు చేపట్టారు. ఇన్నయ్య ఇంటిని చుట్టుముట్టి ఆయన గదిలోని డైరీలు, ఫోన్ కాల్ డేటా, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను పరిశీలించారు. ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో అక్కడ ఎవరెవరు ఉంటున్నారు? ఆశ్రమానికి వస్తున్న నిధుల మూలాలు ఏమిటి? అనే కోణంలో అధికారులు ఆరా తీశారు. సోదాల అనంతరం కొన్ని కీలక పత్రాలు, పెన్ డ్రైవ్‌లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
సోదాలు కేవలం గాదె ఇన్నయ్య ఇంట్లోనే కాకుండా, హైదరాబాద్‌లోని చిక్కడపల్లి, పాతబస్తీతో పాటు ఏపీలోని నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని పలువురు ప్రజా సంఘాల నేతల ఇళ్లపై కూడా ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. పౌర హక్కుల సంఘం నాయకులు, విరసం సభ్యుల ఇళ్లలో కూడా తనిఖీలు కొనసాగాయి.ఈ సోదాలపై గాదె ఇన్నయ్య మీడియాతో మాట్లాడుతూ, తమపై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసులు పెడుతున్నారని, తాము కేవలం ప్రజా సమస్యలపై మాత్రమే పోరాడుతున్నామని పేర్కొన్నారు. ఎన్ఐఏ తదుపరి విచారణ నిమిత్తం కొందరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
Follow Us