/rtv/media/media_files/2025/09/16/masood-azhar-2025-09-16-19-53-36.jpg)
Masood Azhar's family 'torn into pieces' by India, Jaish admits Op Sindoor impact
ఢిల్లీలో పేలుడు(delhi blast case) ఘటనపై NIA దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్(jaish e mohammed) ఉగ్రవాద సంస్థ భారత్ వ్యాప్తంగా భారీ దాడులకు కుట్ర(Pak Terrorists On India) చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందుకోసం ఫిదాయిన్ (ఆత్మాహుతి దళం)ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ దాడుల కోసం జైషే సంస్థ నిధులను కూడా సమకూరుస్తున్నట్లు నిఘా అనుమానిస్తున్నాయి.
Also Read : ఢిల్లీ పేలుళ్ల కేసులో మరో ట్విస్ట్.. అల్ ఫలా యూనివర్సిటీ నుంచి 10 మంది మిస్సింగ్
Jaish-e-Mohammed Donations Online
🚨🔴Jaish-e-Mohammed 🇵🇰 has started donation drive for their terrorists deployed in Jammu & Kashmir 🇮🇳.
— THE UNKNOWN MAN (@Theunk13) November 18, 2025
👉They are demanding PKR 20,000/- for their Complete Winter Survival Kit.
👉Specific items and their costs are listed, including a coat, boots, blanket, gloves, socks etc.… pic.twitter.com/S08mJZJ668
Also Read : పీఎం కిసాన్ నిధులు విడుదల..
ముజాహిద్‌లకు వింటర్ కిట్‌లను అందించేందుకు ఈ విరాళాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఒక్కొక్కరి నుంచి 20వేల పాకిస్థాన్ రూపాయలు అంటే భారత కరెన్సీలో రూ.6,400 విరాళంగా సేకరిస్తున్నట్లు తెలిసింది. ముజాహిద్‌ల కోసం బూట్లు, ఉలెన్ సాక్స్, మెట్రెస్, టెంట్ వంటి వస్తువులను కొనుగోలు చేసేందుకు ఈ డొనేషన్లను సేకరిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ విరాళాలను పాకిస్థాన్‌కు చెందిన సదాపే వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌ల నుంచి స్వీకరిస్తున్నట్లు సమాచారం. మేడమ్ సర్జన్‌గా వ్యవహరిస్తున్న ఎర్రకోట పేలుడులో కీలక అనుమానితుల్లో ఒకరైన డాక్టర్ షాహీనా సాయిద్ ఈ విరాళాల బాధ్యత తీసుకున్నట్లు తేలింది. దీంతో ఈ డిజిటల్ ఫండింగ్ నెట్‌వర్క్‌పై దర్యాప్తు అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
Follow Us