ఎస్సీ వర్గీకరణపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. 60 రోజుల్లో నివేదిక!
ఎస్సీ వర్గీకరణపై ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్గీకరణకు నిర్దిష్టమైన సిఫార్సులను సూచించడానికి రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. దీనిపై కమిషన్ 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది.