/rtv/media/media_files/2025/10/21/what-really-happened-to-nitish-2025-10-21-21-32-54.jpg)
What really happened to Nitish?
Nitish Kumar viral video : బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఆరోగ్యం పై మరోసారి చర్చ మొదలైంది. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య, మానసిక పరిస్థితి సరిగాలేదంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ ఆరోపణలకు తగినట్లే ఆయన ప్రవర్తన ఉండటంతో విపక్షాలకు ఆయుధం దొరికినట్లవుతోంది. అయినా ఆయన తన పద్ధతి మార్చుకోవడం లేదు. తాజాగా మరోసారి ఆయన ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూర్చేలా తాజాగా నీతీశ్ వ్యవహరించారు. ఆయన వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. ఓ వైపు పార్టీ సహచరుడు వారిస్తున్నా వినకుండా ఓ మహిళా అభ్యర్థి మెడలో పూల దండ వేయడం చర్చనీయంశమైంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో ఆర్జేడీ నాయకుడు ప్రతిపక్ష ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ దీన్ని అస్త్రంగా మలుచుకున్నారు. నీతిష్ దండవేసిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్‌గా మార్చారు.
ई गजब आदमी है भाई!!! 😀
— Tejashwi Yadav (@yadavtejashwi) October 21, 2025
मुख्यमंत्री जी अगर स्वस्थ है तो लिखा हुआ भाषण पढ़ ऐसी हरकतें क्यों कर रहे है? #Biharpic.twitter.com/Xhit9l37Ib
ఇది కూడా చదవండి: సచివాలయంలో భారీ మోసం.. మంత్రి పేషీ పేరుతో కోట్లు కాజేసిన కేటుగాళ్లు
బీహార్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి బీహార్‌లో ఎన్డీయే ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది. ఈ సందర్భంగా వేదికపై ఉన్న నీతీశ్ వద్దకు పలువరు అభ్యర్థులు వచ్చి చేతులు జోడించి ఆయనను పరిచయం చేసుకుంటున్నారు. వారికి నీతీశ్ పూలమాలలు వేస్తూ పంపుతున్నారు. ఈ క్రమంలో చేతులు జోడిస్తూ బీజేపీకి చెందిన మహిళా అభ్యర్థి వచ్చారు. ఆ సమయంలో తన చేతిలో ఉన్న దండను ఆమె మెడలో వేయబోయారు. అయితే అక్కడే ఉన్న జేడీయూ రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝా దాన్ని అడ్డుకున్నారు. దీంతో తొలుత నీతీష్ విరమించుకున్నారు. దండను ఆమె చేతికి ఇచ్చినట్లే ఇచ్చి ఆ తర్వాత ఎంపీ కాస్త వెనక్కి వెళ్లడంతో ఈసారి ఆ దండను మహిళ మెడలో వేశారు.
Also Read : దీపావళి వేళ నల్గొండలో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపిన తల్లి.. ఆ తర్వాత ఏం చేసిందంటే..?
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తేజస్వి యాదవ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఆరోగ్యం బాగానే ఉంటే.. రాసిచ్చిన స్పీచ్‌ను చదివాక ఆయనెందుకు ఇలా ప్రవర్తిస్తారు? అంటూ ప్రశ్నించారు. నీతీశ్ ఆరోగ్యం సరిగా లేదంటూ గతంలో తేజస్వి ఇలాంటి వీడియోనే పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన వర్చువల్ సమావేశంలో పదే పదే నమస్కరిస్తున్న వీడియోను పోస్ట్ చేసి ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని తేజస్వి ఆరోపించారు. ఇదే అంశంపై జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ కూడా గతంలో ఇలాంటి విమర్శలే చేశారు. అంతేకాదు నీతీశ్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also read : HYD AQI INDEX : దీపావళి తర్వాత హైదరాబాద్‌లో పెరిగిన వాయు కాలుష్యం! AQI ఇండెక్స్ ఎంతో తెలిస్తే షాక్!