ఎస్సీ వర్గీకరణపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. 60 రోజుల్లో నివేదిక! ఎస్సీ వర్గీకరణపై ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్గీకరణకు నిర్దిష్టమైన సిఫార్సులను సూచించడానికి రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. దీనిపై కమిషన్ 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. By srinivas 16 Nov 2024 | నవీకరించబడింది పై 16 Nov 2024 08:10 IST in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి SC Classification : ఎస్సీ వర్గీకరణపై ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్గీకరణకు తాము సానుకూలంగా ఉన్నామని, అవసరమైన అన్ని సహాకారాలు అందిస్తామని ఇప్పటికే ప్రకటించిన సీఎం చంద్రబాబు సర్కారు మరో ముందడుగు వేసింది. ఈ మేరకు వర్గీకరణకు నిర్దిష్టమైన సిఫార్సులను సూచించడానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. అంతేకాదు ఈ కమిషన్ 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. అలాగే ఈ అంశంలో కమిషన్‌కు కావాల్సిన సమాచారం, పత్రాలు, ఆధారాలు, సహకారం అందించాలని సాంఘిక సంక్షేమశాఖ అధికారులతోపాటు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఇది కూడా చదవండి: పొగమంచు ఎఫెక్ట్.. ఢిల్లీలో పనివేళల్లో మార్పులు Also Read : అల్లు అర్జున్ ఆ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ..! కమిషన్ చేయాల్సిన పనులు.. 1. రాష్ట్ర, జిల్లా, జోనల్ స్థాయిలో సమకాలీన సమాచారం అందించాలి. 2. జనాభా గణన పరిగణనలోకి తీసుకోవాలి. 3. ఎస్సీ ఉప కులాలను ఒక హేతుబద్ధమైన ఉపవర్గీకరణ చేయాలి. 4. షెడ్యూల్డ్ కులాల్లోని ఉప కులాల వెనుకబాటుతనాన్ని గుర్తించేందుకు అధ్యయనం చేయాలి. 5. సర్వీసుల్లో ప్రాతినిధ్యం లేకపోవడం, విద్యాసంస్థల్లో ప్రవేశాలపై దృష్టిపెట్టడం. 6. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని పరిశీలించాలి. 7. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఏపీలో ఎస్సీ వర్గీకరణను సమర్థంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. 8. వర్గీకరణ ప్రయోజనాలు అన్ని ఎస్సీ ఉప కులాలకు సమానంగా అందేలా ప్రణాళిక రూపొందిచాలి. ఇది కూడా చదవండి: Moisturizer: శీతాకాలంలో ఎలాంటి మాయిశ్చరైజర్ ఉపయోగించాలి? Also Read : సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ఇద్దరు స్టార్ సింగర్స్.. ఫొటోలు వైరల్ #nda-alliance #sc-clarifications-bill #cm-chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి