/rtv/media/media_files/2025/09/08/vice-presidential-poll-2025-09-08-10-23-00.jpg)
Vice Presidential poll
Vice Presidential Elections : ఉప రాష్ట్రపతి ఎన్నికలకు గడువు దగ్గరపడుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి పక్షాలు తమ కసరత్తును వేగవంతం చేశాయి. తొమ్మిదో తేదీన జరగబోయే ఎన్నికల్లో తమతమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు వ్యూహాలను రచిస్తున్నాయి. ఓటింగ్ విధానం, పోలింగ్ సరళిపై పార్టీ ఎంపీలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటముల్లో లేని బీఆర్‌ఎస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఉప రాష్ర్ట పతి ఎన్నికల్లో నోటాకు అవకాశం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: BREAKING: పార్టీలో గొడవలు.. పదవికి రాజీనామా చేసిన ప్రధాని!
అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటములు తమ తమ అభ్యర్థులను నిలిపినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి మద్దతు ఇచ్చినా విమర్శలు ఎదుర్కొవలసి వస్తందన్న ఆలోచనతో ఉన్న బీఆర్‌ఎస్ రెండింటికి సమాన దూరంలో ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అని త్వరలో బీజేపీలో పార్టీని విలీనం చేస్తారని ప్రచారం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని బీజేపీ ప్రచారం చేస్తోంది దీంతో ఎవరికీ మద్దతు ఇచ్చిన ఆరోపణలు తప్పవని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన నిజానికి ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ కాంగ్రెస్ మద్దుతు ఇవ్వడంతో బీఆర్‌ఎస్ ఆయనకు ఓటు వేయవద్దని నిర్ణయించుకుంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ వాది. తొలిదశ, మలిదశ ఉద్యమంలో ఆయన క్రీయశీలకంగా పాల్గొన్నారు. కేవలం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ఆయన పాటుపడుతున్నారు. రాజకీయ తటస్థుడిగా పేరున్న ఆయనను ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది.
2022లో జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిని కాదని, ఇండియా కూటమి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు బీఆర్ఎస్ ఓటు వేసింది. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ రూలింగ్‌లో ఉండగా, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం సరికాదని బీఆర్‌ఎస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం బీఆర్ఎస్‌కు రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నారు.సుదర్శన్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, పార్థసారధి రెడ్డి బీఆర్‌ఎస్ సభ్యులుగా ఉన్నారు.
ఇది కూడా చూడండి:Ganesh Nimajjanam 2025: వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి.. క్రేన్ తెగి పడి ఇద్దరు.. నీటిలో కొట్టుకుపోయి మరికొరు..!