బీహార్ ఎన్నికలు.. BJP ముందు 3 సవాళ్లు.. తేడా వస్తే మోదీ ఔట్?

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ అధికార పార్టీ ఓడిపోతే కేంద్రంలో బీజేపీకి పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి ఏర్పడవచ్చని అంటున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

New Update
NDA to win Bihar elections

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్‌కు పరీక్షే. కొంచెం అటూ ఇటూ అయితే ప్రధాని పదవి నుంచి మోదీ పక్కకే. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు గెలవడం జేడీయూ కంటే కేంద్రంలో బీజేపీకి చాలా ముఖ్యం. 243 నియోజకవర్గాలు ఉన్న బీహార్ రాష్ట్రంలో రాజకీయాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయి. కేంద్రంలో బీజేపీ నిలబడాలంటే మెయిన్ పిల్లర్ బిహార్‌లో నితీశ్ కుమార్(జేడీయూ). బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ అధికార పార్టీ ఓడిపోతే కేంద్రంలో బీజేపీకి పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి ఏర్పడవచ్చని అంటున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

2024 లోక్ సభ ఎన్నికల్లో బిహార్‌లో జేడీయూ 12 సీట్లు గెలిచింది. అయితే బీజేపీ 240 MP సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జేడీయూ, తెలుగుదేశం పార్టీలు కీలకం అయ్యాయి. ఎన్డీయే కూటమిలో బిహార్‌ నుంచి జేడీయూ నితీశ్ కుమార్, జనశక్తి పార్టీ చిరాగ్ పాశ్వాన్‌లు భాగం. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ జేడీయూ పార్టీకి బీజేపీతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేన్ని సీట్లు రాకపోతే.. నితీశ్ కుమార్ కూటమి వీడే అవకాశం ఉంది. గతంలో ముఖ్యమంత్రి పదవి కోసం నితీశ్ కుమార్ కుటమినే మార్చేశారు. ప్రాంతీయ పార్టీలు లేదా ఇండియా కూటమితో కలిసే ఛాన్స్ కూడా ఉంది. అలా జరిగితే కేంద్రంలో ఎంపీల మద్దతు కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్ సారథ్యంలోని షిఫ్ట్ అవుతుంది. కావున బిహార్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం నితీశ్ కుమార్ కంటే బీజేపీ పార్టీకే చాలా ముఖ్యం. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచినా ముఖ్యమంత్రిగా మాత్రం నితీశ్ కుమారే అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మంత్రి వర్గం ఏర్పాటులో కూడా బీజేపీ, జేడీయూ నాయకుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటానికి కావాల్సిన ఎంపీ స్థానాలు జేడీయూకు ఉన్నాయి. కానీ స్థానికంగా మొదటి నుంచి బీజేపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులకు అవకాశంలో రాకపోవడంతో వారి అసంతృప్తి వ్యక్తం చేయవచ్చు. బీజేపీకి ఇప్పుడు బిహార్ అసెంబ్లీ ఎన్నికలు పెద్ద సవాలు అనే చెప్పవచ్చు. అటు కూటమి గెలుపు కోసం ప్రయత్నించాలి. అలాగే ఆ రాష్ట్రంలో సొంత పార్టీ నాయకులను సంతృప్తి పరచాలి.  ఈ బిహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025లో ఎన్డీయే కూటమి సత్తా చాటకుంటే.. నితీశ్ కుమార్ కూటమి మారే అవకాశం ఉంది.

పార్లమెంట్ ఎన్నికల సమయంలో  చిరాగ్ పాశ్వాన్, నితీశ్ కుమార్ పార్టీలు కలిసి పని చేసినా.. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సరికీ వారి మధ్య సయోధ్య కుదరడం లేదు. దానికి మంచి ఉదాహరణ ఇటీవల కేంద్ర మంత్రి, జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ అధికార పార్టీపై చేసిన ఆరోపణలే. బిహార్‌లో శాంతిభద్రతలు నెలకొల్పడంలో అధికార పార్టీ ఫెయిల్ అయ్యిందని ఆయన అన్నారు. అంతే కాదు రాష్ట్ర మంత్రి వర్గంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు