/rtv/media/media_files/2025/11/15/women-voters-2025-11-15-08-44-44.jpg)
బీహార్ అసెంబ్లీ ఎన్నిక(Bihar Assembly Elections 2025)ల్లో ఎన్డీయే కూటమి విజయ ఢంకా మోగించింది. ఇప్పటివరకు అధికారంలో ఉన్న కూటమి.. తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. జేడీయే అధిపతి నితీశ్ కుమార్ తో పాటూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అందరూ భారీ ఎత్తున ప్రచారం చేసి గెలుపును తమ వైపుకు తిప్పుకున్నారు. గత 20 ఏళ్లుగా బిహార్ సీఎంగా కొనసాగుతున్న నితీష్ కుమార్.. ప్రజా వ్యతిరేకతను దాటుకుని మరీ విజయాన్ని సాధించడంలో సక్సెస్ అయ్యారు. ఈ 20 ఏళ్ళలో పార్టీలు మారుతూనే ఉన్నారు. కూటములను ఛేంజ్ చేశారు. కానీ ఆయన విజయాన్ని మాత్రం ఎవరూ ఆపలేకపోయారు. ఈ సారి కూడా బీహార్ ఓటర్లు ఆయనకే పట్టం కట్టారు. ఇందులో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించారు.
Also Read : ఈ దేశ ద్రోహులకు నేషనల్ మెడికల్ కమిషన్ బిగ్ షాక్!
వాళ్ళే గెలిపించారు..
నిన్న బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి(nda-alliance) గెలవడానికి ముఖ్యకారణం మహిళా ఓటర్లు. ఈ సారి బీహార్ ఎన్నికల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో మహిళలు చాలా ఎక్కువగా ఉన్నారని సెన్సస్ చెబుతున్నాయి. దానికి కారణం నితీశ్ కుమార్ ప్రభుత్వం ప్రకటించిన మహిళా రోజ్ గార్ యోజన పథకం. మహిళలకు రూ.10 వేల చొప్పున అందించడం.. ఆయన గెలుపులో కీలకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో మొత్తం మహిళలు అందరూ ఎన్డీయే వైపుకు తిరిగిపోయారుని చెబుతున్నారు. బిహార్‌లో మొత్తం 66.91 ఓటింగ్ శాతం నమోదు కాగా అందులో మహిళలే అధికంగా ఉండటం విశేషం. ఈ ఎన్నికల్లో 71.6 శాతం మహిళలు ఓటు వేశారు.
మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో కూడా..
ఇది ఒక్క బీహార్ ఎన్నికల్లోనే కాదు..అంతకు ముందు నుంచీ బీజేపీ అనుసరిస్తూ వస్తున్న వ్యూహాల్లో ఇదే ప్రముఖమైనదిఅని చెప్పాలి. మొదటి నుంచి ఎన్డీయే..మహిళా ఓటర్లను దృష్టిలో పెట్టుకునే ఎన్నికల వ్యూహాలను రచిస్తూ వచ్చింది. అదే వారి విజయానికి కూడా కారణమైంది. గతేడాది జరిగిన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఎన్డీయే ఇదే ఫ్లాన్ ను వర్కౌట్ చేసింది. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అప్పటి శివరాజ్‌సింగ్ ప్రభుత్వంపై ఎన్నికలకు ముందు తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ.. లాడ్లీబహన్ యోజన పేరుతో.. పేద మహిళల ఖాతాల్లో నెలకు రూ.1250 చొప్పున జమ చేశారు. దాంతో అక్కడి మహిళలు అందరూ బీజేపీకి ఓటు వేసి గెలిపించారు. దాని తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ మధ్యప్రదేశ్‌లోని 29 స్థానాల్లోనూ బీజేపీక్లీన్‌స్వీప్ చేయడానికి ఉపయోగపడింది.
ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే లోక్ సభ ఎన్నికల్లో ..ఎన్డీయే కూటమి మహిళలను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అక్కడ ఎన్డీయే కూటమి కేవలం 17 స్థానాలను మాత్రమే దక్కించుకోగలింది. దీంతో తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జాగ్రత్త పడింది. లడ్కీబహెన్ యోజన పేరుతో ఎన్నికల ముందు హహిళ ఖాతాల్లో రూ.1500 వేసింది. ఈ పథకంతో మళ్ళీ మహారాష్ట్రలో ఎన్డీయే విజయం సాధించింది. ఇలా ప్రతీ చోట మహిళలు ఎన్డీయే, తాని కూటమి పార్టీలను గెలుపుకు కారణమయ్యారు. గేమ్ ఛేంజర్లుగా మారారు.
Also Read: Tariffs: సుంకాలపై రాజీకొచ్చిన ట్రంప్.. అత్యవసర సరుకులపై తొలగింపు
Follow Us