Nitish Kumar: శాసనసభాపక్షనేతగా నీతీశ్‌ కుమార్‌.. రేపే సీఎంగా ప్రమాణస్వీకారం !

బీహార్‌లో బుధవారం ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు.. శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ కుమార్‌ను ఎన్నుకున్నారు. మరికాసేపట్లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

New Update
Nitish Kumar set to return as chief minister as NDA finalises leadership ahead of swearing-in

Nitish Kumar set to return as chief minister as NDA finalises leadership ahead of swearing-in

బీహార్‌ అసెంబ్లీ ఎన్నిక(Bihar Assembly Elections 2025) ల్లో ఎన్డీయే కూటమి(nda-alliance) విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు కానుంది. సీఎంగా మరోసారి నితీశ్‌ కుమార్‌ ఖరారయ్యారు. బుధవారం ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు.. శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ కుమార్‌ను ఎన్నుకున్నారు. మరికాసేపట్లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

Also Read: విద్యార్థులు, ఉద్యోగులకు ఫ్రీ AI కోర్స్‌.. గవర్నమెంట్ స‌ర్టిఫికెట్‌ కూడా..!

Nitish Kumar Set To Return As Chief Minister As NDA

బీహార్‌ సీఎంగా గురువారం నితీశ్‌ కుమార్‌(nitish-kumar) ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది ఆయన ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణ స్వీకారం చేయనుండటం గమనార్హం. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంలుగా బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం. ఈ కార్యక్రమం రాష్ట్ర రాజధాని పాట్నాలోని గాంధీ మైదనంలో జరగనుంది. 

Also Read: ఢిల్లీ పేలుళ్ల కేసులో మరో ట్విస్ట్.. అల్‌ ఫలా యూనివర్సిటీ నుంచి 10 మంది మిస్సింగ్‌

ఇదిలాఉండగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 202 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. మహాగఠ్‌బంధన్‌ కూటమి 35 స్థానాల్లో గెలిచింది. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్‌ సురాజ్‌ పార్టీకి మాత్రం ఒక్క సీటు కూడా రాలేదు. మహాగఠ్‌బంధన్‌ కూటమి.. ప్రతీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఉచిత విద్యుత్, పెన్షన్లు పెంచడం లాంటి హామీలు  తమ మెనిఫెస్టోలో ప్రకటించింది. అయినప్పటికీ బీహార్‌ ప్రజలు నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్డీయే కూటమినే గెలిపించారు.

Advertisment
తాజా కథనాలు