/rtv/media/media_files/2025/09/09/cp-radhakrishna-2025-09-09-19-37-10.jpg)
ఉపరాష్ట్రపతి ఎన్నిక(Vice President Election 2025)లో ఎన్డీయే కూటమి(nda-alliance) తరపున పోటీ చేసిన సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై ఆయన 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే రాధాకృష్ణన్ విజయం సాధించడం విశేషం. సీపీ రాధాకృష్ణన్ కు 452 ఓట్లు రాగా, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు లెక్కలోకి రాలేదు. కాగా పార్లమెంట్‌లో మొత్తం ఓటర్లు 781 మంది ఎంపీలు ఉండగా 767 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికకు బీఆర్ఎస్, బీజేడీ, అకాళీదళ్ సభ్యులు పోలింగ్ కు దూరంగా ఉన్నాయి. పార్లమెంట్ నూతన భవనంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి ఫలితాలు వెల్లడించారు.
#WATCH | Delhi: PC Mody, Secretary-General, Rajya Sabha says, "NDA nominee and Maharashtra Governor C.P. Radhakrishnan got 452 first preference votes. He has been elected as the Vice President of India... Opposition's vice-presidential candidate Justice Sudershan Reddy secured… pic.twitter.com/hW7dUY0yfi
— ANI (@ANI) September 9, 2025
Also Read : దారుణం.. మహిళకు నిప్పంటించిన దుండగుడు.. మంటల్లో కాలుతూనే స్కూటీపై
సీపీ రాధాకృష్ణన్ నేపథ్యం ఇదే!
రాధాకృష్ణన్(cp-radhakrishnan) ఒక సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, ఎంపీగా, వివిధ రాష్ట్రాలకు గవర్నర్గా, ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా అత్యున్నత స్థాయికి ఎదిగారు.
రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుప్పూర్లో జన్మించారు. ఆయన తన రాజకీయ జీవితాన్ని చాలా చిన్న వయసులోనే, అంటే 16 ఏళ్ల వయసు నుంచే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్)లో స్వయంసేవక్గా ప్రారంభించారు. ఆయన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో కీలక పాత్ర పోషించారు. రెండుసార్లు కోయంబత్తూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.
గవర్నర్ గా బాధ్యతలు: ఆయన గవర్నర్గా వివిధ రాష్ట్రాలకు సేవలు అందించారు:
జార్ఖండ్ గవర్నర్ (2023 ఫిబ్రవరి నుంచి 2024 జూలై వరకు).
తెలంగాణ గవర్నర్ (2024 మార్చి నుంచి 2024 జూలై వరకు).
మహారాష్ట్ర గవర్నర్ (2024 జూలై నుంచి ప్రస్తుతం )
Also Read : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిరుపతి.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే!