Wall Collapse : ఢిల్లీలో గోడకూలి ఏడుగురు మృతి, మృతుల్లో ఇద్దరు చిన్నారులు
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మృతిచెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. హస్తినలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.