Siliguri Corridor Projects: ఇండియా మాస్టర్ ప్లాన్.. ఈ ప్రాజెక్టులతో చికెన్ నెక్ సేఫ్!

భారతదేశ ప్రధాన భూభాగంతో ఈశాన్య రాష్ట్రాలను కలిపే ఏకైక మార్గం పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి కారిడార్. కేవలం 20-22 కి.మీ వెడల్పు మాత్రమే ఉండే ఈ మార్గాన్ని 'చికెన్ నెక్' అని పిలుస్తారు. దీన్ని ఆక్రమిస్తే ఈశాన్య రాష్ట్రాలు దేశం నుండి విడిపోయే ప్రమాదం ఉంది.

New Update
Siliguri Corridor Projects - Chicken Neck

Siliguri Corridor Projects - Chicken Neck

భారతదేశ(india) ప్రధాన భూభాగంతో ఈశాన్య రాష్ట్రాలను కలిపే ఏకైక మార్గం పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి కారిడార్(Siliguri Corridor Projects). కేవలం 20 నుండి 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండే ఈ మార్గాన్ని 'చికెన్ నెక్'(chicken neck) అని పిలుస్తారు. యుద్ధం, ఉద్రిక్త పరిస్థితుల్లో శత్రువులు ఈ చిన్న మార్గాన్ని దిగ్బంధిస్తే, ఈశాన్య రాష్ట్రాలు దేశం నుండి విడిపోయే ప్రమాదం ఉంది. ఈ సవాలు అధిగమించడానికి భారత్ ఇప్పుడు ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలపై దృష్టి సారించింది. ఈ భౌగోళిక చిక్కుముడికి కారణం 1947 దేశ విభజన సమయంలో జరిగిన చారిత్రక తప్పిదాలే.

Also Read :  ఈపీఎఫ్ సభ్యులకు కొత్త సౌకర్యం.. యూపీఐ ద్వారా డబ్బులు విత్‌డ్రా!

చిట్టగాంగ్ చేజారిన చరిత్ర

1947లో సిరిల్ రాడ్‌క్లిఫ్ భారతదేశాన్ని సందర్శించకుండానే 45 రోజుల్లో విభజన రేఖలు గీశారు. అప్పట్లో మన నాయకులు వాయువ్య సరిహద్దులపై పెట్టిన దృష్టిని బెంగాల్ విభజనపై పెట్టలేదు. నిజానికి చిట్టగాంగ్ ప్రాంతంలో 90% హిందువులు ఉండేవారు. ఇది శతాబ్దాలుగా త్రిపుర రాజ్యంతో ముడిపడి ఉండేది. కానీ, చివరి నిమిషంలో బ్రిటీష్ వారు చిట్టగాంగ్‌ను తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)(chicken neck bangladesh) కు కట్టబెట్టారు. దీనివల్ల ఈశాన్య భారత్ తన సహజసిద్ధమైన సముద్ర మార్గాన్ని కోల్పోయి భూపరివేష్టిత ప్రాంతంగా మిగిలిపోయింది.

ప్రస్తుతం భారత్ ఈశాన్య రాష్ట్రాలను సముద్రంతో అనుసంధానించడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను చేపడుతోంది. 

కలదాన్ మల్టీ-మోడల్ ప్రాజెక్ట్ (మయన్మార్): మిజోరం నుండి మయన్మార్ మీదుగా బంగాళాఖాతాన్ని చేరే మార్గం ఇది. దీని ద్వారా మిజోరం నుండి సముద్ర దూరం కేవలం 250 కిలోమీటర్లు మాత్రమే. ఇది బంగ్లాదేశ్‌తో సంబంధం లేకుండా ఈశాన్య రాష్ట్రాలకు భద్రత కల్పిస్తుంది.

మైత్రీ సేతు (బంగ్లాదేశ్): త్రిపురలోని సబ్రూమ్ నుండి బంగ్లాదేశ్‌లోని రామగఢ్ వరకు ఫెనీ నదిపై ఈ వంతెన నిర్మించబడింది. ఇక్కడి నుండి చిట్టగాంగ్ పోర్ట్ కేవలం 80 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అగర్తలా నుండి కలకత్తాకు రోడ్డు మార్గం 1700 కి.మీ కాగా, చిట్టగాంగ్ మార్గం ద్వారా ఇది చాలా వరకు తగ్గుతుంది.

చాబహార్ తరహా వ్యూహం అవసరం
గతంలో అఫ్గానిస్థాన్‌ని పాకిస్థాన్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నప్పుడు, భారత్ ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్ అభివృద్ధి చేసి ప్రత్యామ్నాయం చూపింది. అదే విధంగా, ఈశాన్య భారత్ విషయంలో కూడా భారత్ తన భౌగోళిక శక్తిని పెంచుకోవాలి.

చైనా తన చరిత్రను ఆధారంగా చేసుకుని భూభాగాలను క్లెయిమ్ చేస్తున్నట్టే, భారత్(chicken neck of india) కూడా చారిత్రక సాక్ష్యాల ఆధారంగా చిట్టగాంగ్ పోర్ట్ ప్రాముఖ్యతను గుర్తించాలి. 1971 బంగ్లాదేశ్ విముక్తి సమయంలోనే మనం సముద్ర కారిడార్ అడిగి ఉండాల్సింది. ఇప్పటికైనా మయన్మార్ మార్గాలను వేగవంతం చేస్తూనే, చిట్టగాంగ్ పోర్ట్ వినియోగంపై పట్టు సాధించడం దేశ సమగ్రతకు ఎంతో కీలకం.

Also Read :  రక్షణ రంగంలో చరిత్రాత్మక డీల్: ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లు..

Advertisment
తాజా కథనాలు