PM Modi: వందేభార‌త్ స్లీప‌ర్ ప్రారంభించిన ప్ర‌ధాని.. వెస్ట్ బెంగాల్‌లో మోదీ గ్యారెంటీ

దేశంలోని మొట్టమొద‌టి వందేభార‌త్ స్లీప‌ర్‌ను శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. హౌరా నుంచి గౌహ‌తి వ‌ర‌కు ఆ రైలు వెళ్తుంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

New Update
Modi flagged off

దేశంలోని మొట్టమొద‌టి వందేభార‌త్ స్లీప‌ర్ రైలును శనివారం ప్రధాని మోదీ(PM Modi) ప్రారంభించారు. హౌరా నుంచి గౌహ‌తి వ‌ర‌కు ప్రయాణించే ఈ రైైలు వందేభారత్ జనరల్‌తో పోల్చితే చాలా గర్జరీగా ఉంటుంది. ఈ రైలు గరిష్టంగా గంటకు 160-180 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. ఇది ప్రస్తుతం ఉన్న రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే వేగంగా గమ్యాన్ని చేరుకుంటుంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందని, రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మాల్దా ఉత్తర నియోజకవర్గంలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ, బెంగాలీ భాషలో "పల్టానో దర్కార్, చాయ్ బీజేపీ సర్కార్" (మార్పు కావాలి, బీజేపీ ప్రభుత్వం రావాలి) అంటూ ఎన్నికల శంఖారావం పూరించారు.

Also Read :  ‘మౌని అమావాస్య’ అంటే ఏంటో తెలుసా? ఆ రోజు సముద్రస్నానం చేయాల్సిందేనా?

బెంగాల్‌లోని మాల్దా రైల్వే స్టేష‌న్ నుంచి ఆయ‌న వందేభారత్ స్లీపర్ రైలును స్టార్ట్ చేశారు. ఇందులో లెటెస్ట్ టెక్నాలజీతో ఆటోమేటిక్ డోర్లు, బయో-వ్యాక్యూమ్ టాయిలెట్స్, ఎర్గోనామిక్ బెర్త్‌లు, ప్రతి బెర్త్ వద్ద రీడింగ్ లైట్లతోపాటు ఛార్జింగ్ పాయింట్లు కూడా ఉంటాయి. అలాగే ఇందులో స్వదేశీ సాంకేతికత 'కవచ్' యాంటీ-కొలిజన్ సిస్టమ్ ఉంది. అన్ని కోచ్‌లలో సిసిటివి కెమెరాలు, అగ్నిప్రమాదాల నివారణ వ్యవస్థలు ఏర్పాటు చేశారు.

ఇక గౌహ‌తి నుంచి హౌరా వ‌చ్చే వందేభార‌త్ స్లీప‌ర్ రైలును ఆయ‌న వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. రైలులో చిన్నారులు, స్కూల్ స్టూడెంట్స్‌తో మోదీ ఇంటెరాక్ట్ అయ్యారు. రాష్ట్రంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బెంగాల్‌ను ఒకప్పుడు అభివృద్ధికి ఇంజిన్‌గా అభివర్ణించిన ఆయన, ఇప్పుడు ఇక్కడ అవినీతి రాజ్యమేలుతోందని మండిపడ్డారు.

శారదా చిట్ ఫండ్, రేషన్ కుంభకోణం, బొగ్గు అక్రమ రవాణా, ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన స్కాములను మోదీ ప్రస్తావించారు. టీఎంసీ నాయకులు యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని, ప్రతి చిన్న పనికి కూడా 'కట్ మనీ' (కమిషన్) వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్, టీఎంసీ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మోదీ ఆరోపించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులకు టీఎంసీ ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని, దీనివల్ల స్థానిక ప్రజల హక్కులు దెబ్బతింటున్నాయని ఆయన హెచ్చరించారు. "కాంగ్రెస్ మీ ఆస్తులను లాక్కోవాలని చూస్తుంటే, టీఎంసీ దాన్ని మౌనంగా సమర్థిస్తోంది" అని వ్యాఖ్యానించారు.

మహిళల పట్ల టీఎంసీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మోదీ తీవ్రంగా తప్పుబట్టారు. సందేశ్‌ఖాలీలో జరిగిన అరాచకాలను దేశం మొత్తం చూసిందని, అక్కడ మహిళలపై దాడులు చేసిన నిందితులను ప్రభుత్వం కాపాడటానికి ప్రయత్నించిందని ఆరోపించారు. ముస్లిం సోదరీమణులను రక్షించడానికి కేంద్రం ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తే, టీఎంసీ దాన్ని వ్యతిరేకించిందని గుర్తు చేశారు.

Also Read :  తమ్ముడి దెబ్బ..అన్న అబ్బా.. ఠాక్రేల ఏకఛత్రాధిపత్యం హుష్ కాకి

మోదీ గ్యారెంటీ

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను ఇక్కడి ప్రజలకు అందకుండా చేస్తోందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. "బెంగాల్ అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో మరియు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి. బీజేపీకి ఇచ్చే ప్రతి ఓటు వికసిత భారత్ నిర్మాణానికి బాటలు వేస్తుంది" అని ప్రధాని స్పష్టం చేశారు. మాల్దా సభకు తరలివచ్చిన జనసందోహాన్ని చూసి ఉత్సాహం వ్యక్తం చేసిన ఆయన, బెంగాల్ మార్పును కోరుకుంటోందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు