Mauni Amavasya : ‘మౌని అమావాస్య’ అంటే ఏంటో తెలుసా? ఆ రోజు సముద్రస్నానం చేయాల్సిందేనా?

మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు.  దీన్నే పుష్య బహుళ అమావాస్య అని కూడా అంటారు. ఇది ఉత్తరాయణం ప్రారంభం అయిన తర్వాత వచ్చే మొట్టమొదటి అమావాస్య. హిందూ ధర్మం ప్రకారం ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉందని నమ్ముతారు. ఈసారి ఆదివారం నాడు వచ్చింది.

New Update
FotoJet - 2026-01-17T160608.032

Mauni Amavasya

Mauni Amavasya : మాఘ మాసంలో వచ్చే అమావాస్య(Magha Amavasya)ను మౌని అమావాస్య అంటారు.  దీన్నే పుష్య బహుళ అమావాస్య అని కూడా అంటారు. ఇది ఉత్తరాయణం ప్రారంభం అయిన తర్వాత వచ్చే మొట్టమొదటి అమావాస్య. హిందూ ధర్మం ప్రకారం ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉందని నమ్ముతారు. ఈసారి మౌని అమావాస్య జనవరి 18, ఆదివారం నాడు వచ్చింది. ఈ పవిత్రమైన రోజున సూర్యోదయానికి ముందు బ్రహ్మ ముహూర్తంలో స్నానం(mahakumbh mauni amavasya snan) చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.  స్నానం, దానం, అలాగే పితృదేవతలకు తర్పణం అర్పించడానికి ఇది అత్యంత పవిత్రమైన తిథిగా పరిగణిస్తారు. మౌని అమావాస్య నాడు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం వల్ల శుభ ఫలితాలు, పాప విముక్తి లభిస్తాయని నమ్ముతారు.. ఇది వ్యక్తి జీవితంలో సుఖ-సమృద్ధిని ప్రసాదిస్తుందని ప్రతీతి. శాస్త్రాల్లో మౌని అమావాస్యకు కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని తప్పక పాటించాలి.

అమావాస్య స్నానం చేసేటప్పుడు, తలపై తెల్ల జిల్లేడు ఆకును ఉంచుకుని శివనామస్మ రణ చేయాలి. ఈ రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టడం చాలా ముఖ్యం. అది సాధ్యం కాకపోతే, అన్నపానీయాలు తీసుకోకుండా, పేదలకు మినప పప్పు, బియ్యం దానం చేయాలి.

Also Read :  వందేభార‌త్ స్లీప‌ర్ ప్రారంభించిన ప్ర‌ధాని.. వెస్ట్ బెంగాల్‌లో మోదీ గ్యారెంటీ

మౌన వ్రతానికి సంకేతం..

పుణ్యప్రదమైన ఉత్తరాయణ కాలం తర్వాత వచ్చే ఈ అమావాస్య రోజున ఉపాసకులు, యతిపుంగవులు, సాధువులు మొదలైనవారు  మౌనంగా వారి వారి సాధనను సాగిస్తారు. ఉత్తర భారతంలో చాలామంది మౌనవ్రతం చేసే సంప్రదాయం ఉంది. అందువల్ల మౌనవ్రతానికి సంకేతంగా దీన్ని ‘మౌని అమావాస్య’ అని పిలుస్తారని కూడా చెప్తారు. తపస్సిద్ధిని పొందిన వారిని ‘మౌని’ "ముని' అంటారు. ఆ రోజు సముద్ర స్నానం చేస్తే మంచిదని అంటారు. ముఖ్యంగా  త్రివేణి  సంగమ స్నానం చేస్తే అత్యంత పుణ్యప్రదమని భావిస్తారు. సముద్రం అందుబాటులో లేనిచోట గోదావరిలో స్నానం కూడా పరమ శుభదాయకం అని చెబుతారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి నది ఏడు పాయాలుగా విడిపోయి సముద్రంలో కలుస్తుంది. ఈ ఏడు సాగర సంగమాలలో స్నానం చేస్తే ఏడు సముద్రాలలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని చెప్తారు. అందుకే దీన్ని సప్త సాగర యాత్ర అని పిలుస్తారు. ఈ యాత్ర చేస్తే చేసిన పాపాలు పోతాయని నమ్ముతారు.

అత్యంత పవిత్రమైన ఆదివారం

కాగా ఈ ఏడాది అమవాస్య జనవరి 18వ తేదీన ఆదివారం రావడం  గొప్ప విశేషం. సాధారణంగా అమావాస్యనాడు సూర్యుడు చాలా బలంగా ఉంటాడని చెప్తారు. ఆ రోజున సూర్యుని గమనం  భూమికి దగ్గరలో ఉంటుంది. జాతకంలో గ్రహదోషాలు ఉన్నవారు ఈ మౌని అమావాస్య నాడు సముద్ర స్నానం లేక త్రివేణి సంగమ లేదా గోదావరి వంటి ఏదైనా జీవనదీ లో స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్య ప్రదానం చేసి ఎర్రని పువ్వులు, ఎర్ర చందనంతో అర్చన జరిపిస్తే సూర్య భగవానుని అనుగ్రహంతో పాటు కుజ, రాహుకేతు గ్రహదోషాలు తొలగి ఆరోగ్య ప్రదాయకుడు, ఆత్మ కారకుడైన సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. తద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పోతాయి. పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఈ మౌని అమావాస్య నాడు బ్రహ్మీ ముహూర్తంలో, అదేవిధంగా సూర్యోదయానికి ముందు స్నానం చేయడం పుణ్యప్రదం.

పితృ కార్యాలు మంచిది

అమావాస్య అనేది పితృ పర్వం కూడా కాబట్టి.. పితృ శాపాలు, జాతకంలో పితృ దోషాలు ఉన్నవారు అన్నదానం, లవణ దానం, పెరుగు దానం, గుమ్మడికాయ దానాలు చేయడం వల్ల  పితృదేవతల అనుగ్రహాన్ని పొందడంతో పాటు ఆయా దోషాల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ మౌని అమావాస్యనాడు యోగ్యుడైన బ్రాహ్మణునికి పితృ ప్రీతిగా బూడిద గుమ్మడికాయను దానం చేయడం వల్ల గుమ్మడికాయ బరువంత బంగారం దానం చేసిన ప్రయోజనం లభిస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి. ఏదైనా కారణంతో సంక్రాంతి నాడు ఆచరించవలసిన దానాలు, సంక్రమణ దిన విధులు ఆచరించలేని వారు ఈ మౌని అమావాస్యనాడు చేయడం వల్ల విశేష ఫలితాన్ని పొందే అవకాశం ఉంది.

Also Read :  తమ్ముడి దెబ్బ..అన్న అబ్బా.. ఠాక్రేల ఏకఛత్రాధిపత్యం హుష్ కాకి

వీరభద్ర స్వామిని దర్శించి...

స్నానం, సూర్యారాధనతో పాటు ఈరోజున కాలభైరవ ఆరాధన, వీరభద్ర ఆరాధన, మహాకాళి వంటి ఉగ్రదేవతల ఆరాధన(Amavasya puja) చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు కాలభైరవుడిని సందర్శించి ఆయనకు 21 లేక 27 లేక 36 మినప గారెల మాలను సమర్పించి బూడిద గుమ్మడి దీపాన్ని వెలిగిస్తే ఆ సమస్యలనుంచి విముక్తి పొందుతారు.అంతేకాక మనోభీతి, మానసిక అశాంతి వంటి సమస్యలు పోతాయి. వీరభద్ర స్వామిని దర్శించి బిల్వదళాలతో అర్చన జరిపించి భద్రకాళి అమ్మవారికి 21 లేక 54 లేదా 108 సంఖ్య నిమ్మకాయలతో గుచ్చిన దండను సమర్పించినట్లయితే భూత బాధలు, దుష్ట గ్రహ బాధలు, నరఘోష వంటి దోషాలు దూరం అవుతాయి. ఆదివారం అమావాస్య రోజున ప్రదోష సమయంలో ముళ్లతో ఉండే గారమండను (గార చెట్టు కొమ్మ) పసుపు కుంకుమలతో పూజించి సాంబ్రాణి ధూపం వేసి ప్రధాన గుమ్మానికి కట్టి ఉంచడం వల్ల సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్ర గ్రంధాలు చెబుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు