/rtv/media/media_files/2026/01/17/betting-sites-2026-01-17-17-54-49.jpg)
ఆన్‌లైన్ బెట్టింగ్(online-betting), అక్రమ జూదం వెబ్‌సైట్(betting websites ban) లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉక్కుపాదం మోపింది. దేశవ్యాప్తంగా అక్రమంగా నిర్వహిస్తున్న 242 బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లను బ్లాక్ చేస్తూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. 'ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్, 2025' నిబంధనల ప్రకారం ఐటీ మంత్రిత్వ శాఖ ఈ చర్యలు చేపట్టింది. గతేడాది అమల్లోకి వచ్చిన కొత్త గేమింగ్ చట్టం తర్వాత ప్రభుత్వం నిఘా ముమ్మరం చేసింది.
ఇప్పటివరకు ప్రభుత్వం మొత్తం 7,800 కంటే ఎక్కువ అక్రమ సైట్లను నిషేధించింది. కేవలం 2024 నుంచి ఇప్పటివరకు వేల సంఖ్యలో యూఆర్‌ఎల్‌లను తొలగించారు. విదేశాల నుంచి భారతీయులను టార్గెట్‌గా చేసుకుని నడుస్తున్న 'మిర్రర్' వెబ్‌సైట్లు, ప్రాక్సీ డొమైన్లపై ప్రత్యేక దృష్టి సారించింది. యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడటమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Also Read : JEE Main Admit Cards: జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు విడుదల
Central Government Will Ban Betting Websites
సులభంగా డబ్బు సంపాదించవచ్చనే మోసపూరిత ప్రకటనలతో యువతను ఆకర్షించి, వారిని అప్పుల ఊబిలోకి నెట్టడం. ఆన్‌లైన్ జూదం వల్ల కలిగే వ్యసనం అనేక కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది. భారీగా డబ్బు పోగొట్టుకున్న కొందరు యువకులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుండటం ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ సైట్లు వినియోగదారుల వ్యక్తిగత మరియు బ్యాంకింగ్ సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లు సైబర్ భద్రతా విభాగాలు గుర్తించాయి.
కఠినమైన నిబంధనలు
ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్, 2025 ప్రకారం, నగదుతో ముడిపడిన దాదాపు అన్ని రకాల జూద క్రీడలను ప్రభుత్వం నిషేధించింది. కేవలం ఎటర్‌టైన్‌మెంట్, ఎడ్యుకేషన్ ప్రయోజనాల కోసం ఉండే గేమ్‌లను మాత్రమే అనుమతిస్తోంది. ఈ దాడుల వల్ల కేవలం సైట్ల నిర్వాహకులు, నిధులు సమకూర్చే సంస్థల పైనే కాకుండా, వాటిని ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కూడా నిఘా పెంచారు.
ప్రభుత్వం ఎన్ని సైట్లను బ్లాక్ చేస్తున్నా, నిర్వాహకులు కొత్త డొమైన్ పేర్లతో మళ్లీ రంగప్రవేశం చేస్తున్నారు. ఈ 'URL స్విచింగ్' వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రజలు ఇటువంటి మోసపూరిత వెబ్‌సైట్‌లకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read : ఇండియా మాస్టర్ ప్లాన్.. ఈ ప్రాజెక్టులతో చికెన్ నెక్ సేఫ్!
Follow Us