/rtv/media/media_files/2026/01/18/fotojet-2026-01-18t120739-2026-01-18-12-07-58.jpg)
Mauni Amavasya
Mauni Amavasya :ఈ రోజు (జనవరి 18, 2026) మౌని అమావాస్య. మౌనీ అమావాస్య(mahakumbh mauni amavasya snan)ను మాఘీ అమావాస్య అని కూడా పిలుస్తారు. సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువు, కుజుడు, బుధుడు వంటి ఆరు గ్రహాలు శని ఆధీనంలోని మకరరాశిలో ఉండటం వల్ల రాశుల వారీగా ప్రభావం ఉంటుంది. భారతదేశంలో ఈ అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఇది జ్యోతిష్య శాస్త్ర పరంగా, 12 రాశులపై దాని ప్రభావం చూపుతుందంట.ముఖ్యంగా మౌనీ అమావాస్య వలన కొన్ని రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి.మేషం, కర్కాటకం, వృశ్చికం వంటి రాశులకు ఇది శక్తి, ధైర్యాన్ని ఇచ్చి శుభం కలిగిస్తుంది, అయితే మిగిలిన రాశులు మౌన వ్రతం, దానధర్మాలు, పితృ తర్పణ వంటివి చేయడం ద్వారా కర్మ బంధాలను వదులుకోవచ్చు, ముఖ్యంగా శని ప్రభావంతో ఉన్నవారు కాళీ పూజ చేయడం మంచిది. ఇంతకీ దాని ప్రభావం ఏంటో ఇప్పుడు చూద్దాం. - ganga snanam
Also Read : నోటి బ్యాక్టీరియాతో లివర్ ఫసక్.. షాకింగ్ రిపోర్ట్!
రాశుల వారీగా మౌని అమావాస్య ప్రభావం (2026):
మేషం (Aries): ఈ రోజు ధైర్యం, శక్తి పెరుగుతాయి, ముఖ్యమైన పనులకు, సాహసోపేత నిర్ణయాలకు మంచి రోజు.మేష రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మౌనీ అమావాస్య వీరికి లక్కు తీసుకొస్తుంది. ఈ సమయంలో వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. వీరికి అదృష్ట సంఖ్య 5, ఆకు పచ్చరంగు కలిసి వస్తుంది.
కన్యా రాశి : కన్యా రాశి వారికి మౌనీ అమావాస్య లక్కు తీసుకొస్తుంది. ఈ రాశి వారికి ఉద్యోగంలో మంచి స్థానం లభిస్తుంది. జాబ్ మారాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. సామాజిక హోదా పెరుగుతుంది. వీరి అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు గులాబీ.
మిథున రాశి : మిథున రాశి వారికి కెరీర్ పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. కొత్త ప్రాజెక్ట్స్ చేస్తారు. అంతే కాకుండా ఈ రాశి వారు కుటుంబ, సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
వృశ్చికం (Scorpio): ఈ రాశి వారికి కూడా శుభ ఫలితాలు ఉంటాయి, ధన లాభాలు, అదృష్టం కలుగుతుంది.
కుంభం (Aquarius): ఈ రాశి వారు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది, శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి రియల్ ఎస్టెట్ రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారు కుటుంబ సభ్యుల నుంచి ప్రేమను ఎక్కువగా పొందుతారు. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. వీరి అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు నారింజ
మకర రాశి : మకర రాశి వారికి అన్ని విధాల కలిసి వస్తుంది. ఎవరు అయితే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటారో వారికి ఇది మంచి సమయం. కుటుంబంలోని వివాదాలు దూరం అవుతాయి. వ్యాపారస్తులు మంచి లాభాలు అందుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
కర్కాటకం (Cancer): శని ప్రభావంతో మానసిక స్థితిలో మార్పులు రావచ్చు, మౌన వ్రతం, ధ్యానం మంచిది.
ఇతర రాశులు: సూర్యచంద్రుల కలయికతో మానసిక అస్థిరత, ప్రతికూల ఆలోచనలు రావచ్చు, కాబట్టి మౌనంగా ఉండి, దానధర్మాలు చేయడం (ఆహారం, బట్టలు), పితృదేవతలకు తర్పణం చేయడం మంచిది.
Also Read : పాము గుడ్లు తినొచ్చా..? ఈ విషయం తెలిస్తే అవునా.. నిజమా.. అని అవాక్కవుతారు..!
మౌని అమావాస్య ప్రాముఖ్యత చేయవలసినవి:
మౌన వ్రతం: మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, ప్రతికూలతను తొలగించడానికి మౌనంగా ఉండటం.
గంగా స్నానం: పుణ్యనదులలో స్నానం చేయడం పాపాలను తొలగిస్తుంది.
దానధర్మాలు: పేదలకు, ఆకలితో ఉన్నవారికి ఆహారం, బట్టలు దానం చేయడం.
పితృ తర్పణం: పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజు అనువైనది.
కాళీ పూజ: శని దోషాలు ఉన్నవారు కాళీ దేవిని పూజించాలి.
ముఖ్య గమనిక: ఈ సమాచారం సాధారణ జ్యోతిష్య నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుడిని సంప్రదించడం మంచిది.
Follow Us