/rtv/media/media_files/2026/01/18/indigo-2026-01-18-15-08-23.jpg)
Bomb threat on tissue forces Delhi-Bagdogra IndiGo flight to make emergency landing in Lucknow
ఈ మధ్య పాఠశాలలు, విమానాశ్రయలకు బాంబు బెదిరింపులు వస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్‌కు వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగించింది. దీంతో విమానాన్ని వెంటనే లక్నోలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఆదివారం ఉదయం 238 మంది ప్రయాణికులతో ఎయిర్ఇండియా ఫ్లైట్ ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగరాకు బయలుదేరింది.
Also Read: యూపీలో పొగమంచుతో ప్రమాదం.. 12 మంది స్పాట్ లో...
Bomb Threat On Tissue Forces Delhi-Bagdogra IndiGo Flight
ఫ్లైట్ గాల్లో ఉండగా టాయిలెట్‌లోని ఓ టిష్యూ పేపర్‌పై విమానంలో బాంబు పెట్టినట్లు రాసి ఉంది. ఇది గుర్తించిన సిబ్బంది వెంటనే లక్నో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారం అందించారు. అత్యవసర ల్యాండింగ్ కోసం రిక్వెస్ట్ పంపారు. దీంతో లక్నో ఎయిర్‌పోర్టు అధికారులు ఫైర్ టెండర్లు, అంబులెన్సులను రెడీగా ఉంచారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులను కిందకి దించేశారు. ఆ తర్వాత బాంబు స్క్వాడ్ బృందం విమానంలో తనిఖీ చేశారు. ఆ విమానాన్ని టెర్మినల్ ప్రాంతంలో ఉంచినట్లు అధికారులు చెప్పారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలు చేరేందుకు వేరే విమానాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Also Read: బాలీవుడ్ పై కామెంట్స్..వివాదంలో సంగీత దర్శకుడు రెహమాన్..
Follow Us