/rtv/media/media_files/2025/03/29/APJtJcXF4Fq9zbUczJA1.jpg)
Maoists encounter Photograph: (Maoists encounter )
Encounter : మావోయిస్టు పార్టీకీ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్(bijapur naxal encounter) లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ నేత పాపారావు అలియాస్ మోంగు ఉన్నాడు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు వ్యూహకర్తగా పాపారావు వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లలో సీనియర్ నేతలు మృతి చెందిన తర్వాత మిగిలిన టాప్ లీడర్లలో ఒకరిగా పాపారావు కొనసాగుతున్నాడు.
పాపారావు కదలికలపై సమాచారం అందడంతో ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో పాపారావుతో పాటు మరో మావోయిస్టు మరణించాడు. పాపారావుపై కోటి రూపాయల వరకు రివార్డు ఉంది. ఘటన స్థలంలో ఏకే రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read : కాంగ్రెస్ MLA షాకింగ్ కామెంట్స్.. 'ఆ కులం అమ్మాయిల్ని అత్యాచారం చేస్తే పుణ్యం'
పాపారావుపై రూ.కోటి రివార్డు..
ఛత్తీస్‍గఢ్(chattisgarh maoist encounter) లోని కిష్టారం ప్రాంతానికి చెందిన పాపారావు.. మాడ్వి హిడ్మా వంటి సీనియర్ నేతలు మరణించిన తర్వాత దక్షిణ బస్తర్‌లో మిగిలిన టాప్ మావోయిస్టు నేతల్లో ఇతడు ఒకడిగా కొనసాగుతున్నారు. దక్షిణ బస్తర్‍లో ఉన్న మావోయిస్టు క్యాడర్లపై పాపారావుకు గట్టి పట్టు ఉంది. దీంతో గత కొంతకాలంగా 'ఆపరేషన్ పాపారావు' (Operation Papa Rao) పేరుతో భద్రతా దళాలు ఛత్తీస్ గఢ్ అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో పాపారావు దళం సంచరిస్తోందన్న సమాచారం మేరకు బస్తర్ ఐజీ పి.సుందర్‌రాజ్ నేతృత్వంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), CoBRA దళాలు ఇవాళ తెల్లవారుజామున జాయింట్ కూబింగ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈ క్రమంలో జరిగిన భీకర కాల్పుల్లో పాపారావుతో పాటు మరో మావోయిస్టు మరణించారు. పాపారావుపై కోటి రూపాయల వరకు రివార్డు ఉంది. కాగా ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతో పాటు రెండు ఏకే రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
కాగా పాపారావు కోసం గత కొంతకాలంగా గాలిస్తున్న భద్రతా దళాల నుంచి పాపారావు గతేడాది నవంబర్ లో తృటిలో తప్పించుకున్నారు. బీజాపూర్(bijapur encounter) జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో నవంబర్ 11న జరిగిన ఎన్‍కౌంటర్ నుంచి ఆయన చాకచక్యంగా తప్పించుకున్నారు. ఈ ఘటనలో మద్దేడు ఏరియా కమిటీ కార్యదర్శి బుచ్చన్నతో పాటు పాపారావు భార్య పామేడు ఏరియా కమిటీ కార్యదర్శి ఊర్మిళ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే నాడు ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో నుంచి తప్పించుకున్న పాపారావు ఇప్పుడు అదే అడవుల్లో భద్రతా దళాల చేతిలో చనిపోవడం యాదృచ్ఛికమే.
Also Read : ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్లకు కేంద్రం బిగ్ షాక్: మరో 242 వెబ్‌సైట్లు బ్లాక్!
Follow Us