JEE Main Admit Cards 2026: జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల

జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)ఈ రోజు విడుదల చేసింది. కాగా జనవరి 21, 22, 23, 24 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డుల్ని jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో ఉంచింది.

New Update
Jee mains 2026

JEE Main Admit Cards

JEE Main Admit Cards 2026: జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 (JEE Main 2026) పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)  ఈ రోజు (శనివారం) విడుదల చేసింది. కాగా ఈ నెల (జనవరి) 21, 22, 23, 24 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డుల్ని jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) తెలిపింది. దేశవ్యాప్తంగా జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 పరీక్ష(JEE Main 2026 exam), 29న పేపర్‌ -2 పరీక్ష జరగనున్నాయి. ప్రస్తుతానికి తొలి నాలుగు రోజులకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను విడుదల చేయగా.. 28, 29 తేదీల్లో జరిగే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను తర్వాత విడుదల చేస్తారు. నాలుగు రోజులు మొత్తం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. తొలి షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు; రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తామని ఎన్టీఏ తెలిపింది.

Also Read :  IBM Jobs: యువతకు ఐబీఎం బంపరాఫర్.. ఏఐలో 50 లక్షల మందికి ఉద్యోగాలు

డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఇలా..

కాగా అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి jeemain.nta.nic.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
హోంపేజీలో జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డు 2026 సెషన్‌-1కు సంబంధించిన లింక్‌పై క్లిక్‌ చేయాలి.
మీ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్‌ అవ్వాలి.
జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డు స్క్రీన్‌పై కనబడుతుంది. దాన్ని ప్రింటవుట్‌ తీసుకోవచ్చు. 
కార్డుపై మీరు పరీక్ష రాసే నగరం, ఇతర వివరాలన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి.
ఏదైనా సమస్య ఉంటే [email protected] ద్వారా ఎన్‌టీఏకు ఫిర్యాదు చేయాలి.

Also Read :  BANK JOBS: బ్యాంక్ ఉద్యోగ అభ్యర్థులకు బిగ్ షాక్.. నియామకాల్లో భారీ మార్పులు!

Advertisment
తాజా కథనాలు