Crime News: మరో పరువు హత్య.. వేరే కులం వ్యక్తితో పారిపోయిందని కూతుర్ని హతమార్చిన తండ్రి
బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలో దారుణం జరిగింది. తన కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తితో పారిపోయిందని ఆగ్రహించిన తండ్రి ఆమెను ఇంటికి రప్పించి హత్య చేశాడు. చివరికి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు.