/rtv/media/media_files/2025/07/15/assam-woman-killed-her-husband-and-burying-his-body-in-the-house-premises-2025-07-15-07-53-17.jpg)
assam woman killed her husband and burying his body in the house premises
ఆమె పేరు రహీమా. భర్తతో వివాదం జరగడంతో అతడిని హత్య చేసింది. ఎవరికీ తెలియకుండా ఉండేందుకు పక్కా ప్లాన్ వేసింది. ఇంట్లోనే 5 అడుగుల గుంత తవ్వి పూడ్చిపెట్టింది. తన భర్త పని నిమిత్తం వేరే రాష్ట్రం వెళ్లాడని చుట్టుపక్కల వారిని నమ్మించింది. అనంతరం డౌట్ రావడంతో స్థానికులు మృతుడి సోదరుడికి సమాచారం ఇచ్చారు. అతడు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వగా.. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను విచారించారు. ఈ విచారణలో నిందితురాలు మొత్తం నిజం బయటపెట్టింది. అనంతరం ఆమెను అరెస్టు చేశారు. జూన్ 26న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: అబ్బా తమ్ముడూ.. Vivo నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. కెమెరా సూపరెహే!
Assam Woman Arrested
గువాహటికి చెందిన రహీమా ఖాతున్, సబియాల్ రెహ్మాన్ (38)కు 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు సంతానం. వీరు అస్సాం రాజధాని పాండు ప్రాంతంలోని జోయ్‌మతి నగర్‌లోని నివాసముంటున్నారు. పాత ఇనుపసామాన్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే జూన్ 26న భార్య భర్తల మధ్య ఓ చిన్న గొడవ తీవ్ర వివాదానికి దారి తీసింది.
Also Read: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!
ఇద్దరూ గట్టిగా గొడవ పడ్డారు. దీంతో కోపంతో రహీమా తన భర్తపై దాడి చేసింది. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలు కాగా.. అతడు కొంత సమయం తర్వాత మరణించాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు రహీమా పక్కా ప్లాన్ వేసింది. ఇంటి లోపల 5 అడుగుల లోతు గుంత తవ్వి తన భర్త మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. రెహ్మాన్ చాలా రోజులుగా కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి రహీమాను ప్రశ్నించాగా.. తన భర్త పని కోసం కేరళకు వెళ్లాడని చెప్పింది.
Also Read: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!
ఇక ఎన్ని రోజులైన రెహ్మాన్ తిరిగి ఇంటికి రాకపోవడంతో అనుమానం మరింత బలపడి.. ఆమెను మరోసారి ప్రశ్నించారు. అప్పుడే తనకు హెల్త్ బాలేదని.. హాస్పిటల్‌కు వెళ్లాలని చెప్పి అక్కడి నుంచి పరారైంది. దీంతో స్థానికులు వెంటనే మృతుడు రెహ్మాన్ సోదరుడికి సమాచారం అందించారు. దీంతో అతడు జూలై 12న జలుక్‌బరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ మరుసటి రోజు రహీమా పోలీసుల ఎదుట లొంగిపోయింది. భార్య భర్తల మధ్య తలెత్తిన గొడవ నేపథ్యంలో తన భర్తను తానే హత్య చేసినట్లు అంగీకరించింది. అతని మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పాతిపెట్టినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి.. మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం ఫొరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.