BIG BREAKING: చేసిందంతా టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డే.. వినుత సంచలన ఆరోపణలు!

శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న జనసేన నేత వినుత దంపతులు ఈరోజు చెన్నై కోర్టు ఆవరణలో సంచలన ఆరోపణలు చేశారు. హత్య వెనుక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారని చెప్పారు. 

New Update
vinuta-kota

శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న జనసేన నేత వినుత దంపతులు ఈరోజు చెన్నై కోర్టు ఆవరణలో సంచలన ఆరోపణలు చేశారు. హత్య వెనుక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారని చెప్పారు. త్వరలోనే నిజాలు అన్నీ బయటకు వస్తాయని అన్నారు. 

శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జ్ వినూత డ్రైవర్ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్య కేసులో మిస్టరీ వీడింది. డ్రైవర్ హత్యకు అసలు కారణం ఏంటో పోలీసులు వెల్లడించారు. రాజకీయ కారణాలతోనే ఈ హత్య జరిగినట్లు నిర్ధారించారు. డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడును శ్రీకాళహస్తిలోనే హత్య చేసిన నిందితులు చెన్నై శివారు కాలువలో పడేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య కేసులో జనసేన నాయకురాలు వినూత, ఆమె భర్త చంద్రబాబు, గోపి, శివకుమార్, షేక్ థాసన్ లను అరెస్ట్ చేశామని చెన్నై పోలీసులు వివరించారు. యువకుడి హత్య గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. వినుత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు నిందితులను శ్రీకాళహస్తి తీసుకొచ్చి పోలీసులు అన్నీ కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్లు సమాచారం. శ్రీనివాసులు అలియాస్ రాయుడు గతంలో వినుత వద్ద కారు డ్రైవర్ గా, పీఏగా కూడా పనిచేశాడు.  రెండు వారాల కిందటే అతన్ని ఆమె విధుల నుంచి తొలగించినట్లుగా సమాచారం

Advertisment
Advertisment
తాజా కథనాలు